చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ పేరుతో జరుగుతున్న దారుణాలు రోజుకొక్కటి బయటపడుతూనే ఉన్నాయి. స్టార్ అవ్వాలనే కలతో వచ్చిన అమ్మాయిలను అవకాశాలు ఇస్తామని మోసం చేసి వారి జీవితాలను నాశనం చేస్తున్న ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. అలాంటి సంఘటనల్లో తాజాగా ఒకటి షాకింగ్‌గా మారింది. ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో, సినిమాల్లో అవకాశం ఇప్పిస్తామని నమ్మించి ఒక మైనర్ బాలికపై అసిస్టెంట్ డైరెక్టర్ శివారెడ్డి, అకౌంటెంట్ అనిల్ దీర్ఘకాలంగా లైంగిక దాడికి…