2023 మొదలై నెల రోజులు గడవగానే టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. వీవీ వినాయక్, శ్రీను వైట్ల లాంటి టాలెంటెడ్ డైరెక్టర్స్ కి గురువు అయిన దర్శకుడు సాగర్ (విద్యాసాగర్ రెడ్డి) ఈరోజు ఉదయం 6 గంటలకు చెన్నైలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విద్యాసాగర్ రెడ్డి, ట్రీట్మెంట్ తీసుకుంటూ హాస్పిటల్ లోనే మృతి చెందారు. ఆయన అంత్యక్రియలు చెన్నైలోనే జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. దర్శకుడు బి.వి.ప్రసాద్ వద్దనే…