మా పాదయాత్రతో సీఎం కేసీఆర్ వెన్నులో వణుకు స్టార్ట్ అయ్యిందని వ్యాఖ్యానించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. నిర్మల్ జిల్లా అడెల్లి పోచమ్మను దర్శించుకున్న ఆయన.. 5వ విడత పాదయాత్రను ప్రారంభించారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలో అనేక సమస్యలు ఉన్నాయి.. కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు, ప్రజల కష్టాలను గాలికి వదిలేసి, ఫామ్ హౌస్‌కే పరిమితం అయ్యారని ఆరోపించారు.. ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు, ప్రజలకు భరోసా కల్పించేందుకే పాదయాత్ర చేస్తున్నానని.. ఇప్పటివరకు నాలుగు విడతలుగా…