Fifa World Cup: ఇంటిదారి పట్టిన ఇరాన్.. సంబరాలు జరుపుకున్న ఇరాన్ ప్రజలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Protesters celebrate Iran defeat against US in FIFA World Cup: క్రీడల్లో తమ జట్టు ఓడిపోతే.. ఆ దేశపు ప్రజలు సంబరాలు జరుపుకుంటారా? క్రీడాకారులు సరిగ్గా ప్రదర్శించలేదని దుమ్మెత్తి పోస్తారు. కోపంతో రగిలిపోతూ.. విమర్శనాస్త్రాలు సంధిస్తారు. ఆ రోజంతా నిరాశలోనే ఉంటారు. కానీ.. ఇరాన్ ప్రజలు మాత్రం అందుకు భిన్నంగా సంబరాలు జరుపుకున్నారు. అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం. యూఎస్ఏతో జరిగిన మ్యాచ్‌లో 1-0 తేడాతో ఓడిపోవడంతో.. ఫిఫా వరల్డ్ కప్ 2022 నుంచి ఇరాన్ నిష్క్రమించింది. ఈ ఓటమి అనంతరం ఇరాన్ ప్రజలు వీధుల్లోకి వచ్చి, డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అయినా.. ఇరాన్ ప్రజలు ఎందుకిలా చేశారు? ఇందుకు ఓ కారణం ఉంది. హిజాబ్‌కు వ్యతిరేకంగా ఇరాన్‌లో తీవ్రస్థాయిలో ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే! ఈ ఆందోళనల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు కూడా! ఈ నేపథ్యంలోనే.. ఈ ఆందోళనలకు మద్దతుగా ఫిఫా వరల్డ్‌కప్‌లో పాల్గొనకుండా ఇరాన్‌ని బహిష్కరించాలని ప్రజలు కోరారు. అయితే.. ఇరాన్ జట్టు ఖతార్ వెళ్లి, ఫిఫా వరల్డ్‌కప్ పోటీల్లో పాల్గొంది. ఈ పోటీల్లో పాల్గొన్నప్పటి నుంచి.. ఇరాన్ జట్టు ఫిఫా వరల్డ్‌కప్‌లో ఓడిపోవాలని, అసలు ఈ మెగా టోర్నీ నుంచి నిష్క్రమించాలని బలంగా కోరుకున్నారు. వాళ్లు కోరినట్టుగానే.. యూఎస్ఏ చేతిలో ఓడిపోయి, ఫిఫా వరల్డ్‌కప్ నుంచి వైదొలిగింది. ఈ ఆనందంలోనే ఆ దేశ ప్రజలు ఇలా రోడ్లపైకి వచ్చి, సంబరాలు చేసుకుని, తమ నిరసన తెలియజేశారు.
Also Read
- Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
- Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
- Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
కాగా.. మాసా అమీని అనే యువతి సరిగ్గా హిజాబ్ ధరించలేదన్న అభియోగాలతో, ఇరాన్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. అయితే.. కొన్ని రోజుల్లోనే ఆ యువతి కస్టడీలో అనుమానాస్పద మృతి చెందడంతో.. హిజాబ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళనలు మొదలయ్యాయి. ఈ ప్రదర్శనల్ని ‘అల్లర్లు’గా అభివర్ణిస్తున్న ఇరాన్.. వాటిని అణచివేసేందుకు ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటివరకూ ఈ ఆందోళనల్లో 448 మంది నిరసనకారులు చనిపోయారని, మృతుల్లో చిన్నారులు సైతం ఉన్నారని నార్వేకు చెందిన ఇరానియన్ హ్యూమన్ రైట్స్ సంస్థ వెల్లడించింది.
After the defeat of the Islamic Republic of Iran national team against the #USA and eliminating from the #FIFAWorldCup people in Kurdistan and major cities in Iran took the streets to celebrate. Here is the Kurdish city of Sine (Sanandaj) 😃 pic.twitter.com/MC2K0tYkFE
— Mutlu Civiroglu (@mutludc) November 29, 2022
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!