ఎన్నికల సంఘం ఉప ఎన్నికలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 13న కేరళ, పంజాబ్, యూపీలో జరగాల్సిన ఉప ఎన్నికలను ఈనె 20వ తేదీకి వాయిదావేసింది. ఇప్పుడు నవంబర్ 20న జరగనున్నాయి. వివిధ పండుగల కారణంగా ఓటింగ్‌ను వారం రోజులు వాయిదా వేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. నవంబర్ 13న జరగాల్సిన ఓటింగ్‌ను వాయిదా వేయాలని కాంగ్రెస్, బీజేపీ సహా పలు పార్టీలు ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.
దేవరగట్టు కర్రల సమరంలో హింసను నియంత్రించేందుకు పోలీసులు తీసుకున్న ముందస్తు చర్యలు ఎలాంటి ఫలితాలు ఇవ్వలేదు. అధికారులు రూపొందించిన ప్రణాళికలు అమలవ్వకపోవడం వల్ల ఈ సమరంలో 70 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, వారిలో ఇద్దరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా హోళగుంద మండలంలో ప్రతి సంవత్సరం దసరా రోజు అర్ధరాత్రి బన్ని ఉత్సవం జరగుతుంది. ఈ ఉత్సవంలో కర్రల సమరం జరిగి, ఇద్దరు…
High Alert in Delhi: దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు హై అలర్ట్ జారీ చేశారు. దసరా, దీపావళి పండుగల సందర్భంగా ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని సమాచారం ఢిల్లీ పోలీసులను నిఘా వర్గాలు అందించాయి.
రాబోయే పండుగలకు చేనేత వస్త్రాలు కొనుగోలు చేద్దాం అంటూ ఏపీ సీఎం నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. పండుగ వేళ చేనేత దుస్తులు ధరించుదాం... నూలుపోగుతో అద్భుతాలు సృష్టించే చేనేత కార్మికులు కూడా మరింత ఆనందంగా పండుగ చేసుకునేలా చేద్దాం అని సూచించారు.
Nagoba Jatara: గిరిజన బిడ్డల సంబరాలు అంబరాన్ని తాకే నాగోబా జాతరకు సర్వం సిద్ధమైంది. ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో జరుగుతున్న నాగదేవత నాగోబా జాతర కన్నుల పండువగా కొనసాగుతోంది.
Mallanna Jatara: వరంగల్ జిల్లా ఐనవోలు జాతరకు భక్తులు పోటెత్తారు. భోగి పర్వదినం, ఆదివారం సెలవు కావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం నుంచే క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. మల్లన్న దర్శనానికి 4 గంటలకు పైగా సమయం పడతుంది. ఐనవోలు శ్రీమల్లికార్జున స్వామి ఆలయంలో వీఐపీల సందడి చేశారు. ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామిని కుటుంబ సమేతంగా మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మాజీ డిప్యూటీ సీఎం,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నవంబర్ నెలలో బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేసింది. ఆర్‌బీఐ హాలిడే క్యాలెండర్ ప్రకారం నవంబర్ నెలలో మొత్తం 15 రోజుల పాటు బ్యాంకులు మూతపడతాయి. అంటే బ్యాంకులకు 15 రోజులు సెలవులే ఉన్నాయి.
Bank Holidays: సామాన్యుడి జీవితంలో బ్యాంకు ఒక ముఖ్యమైన భాగం. ఖాతా నుంచి డబ్బులు డ్రా చేయడం దగ్గర్నుంచి డబ్బు డిపాజిట్ చేయడం, పాత నోట్లు మార్చుకోవడం తదితరాల వరకు బ్యాంకులకు వెళ్లాల్సిందే.
రంజాన్ పండగ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈద్, అక్షయ తృతీయ వంటి రాబోయే పండుగల దృష్ట్యా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి ఆదేశాలు జారీ చేసింది. రోడ్లపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే ఎటువంటి మతపరమైన కార్యక్రమాలు నిర్వహించకూడదని ఆదేశించింది.