బంగాళాఖాతంలో ఏర్పడిన ‘ఫెంగల్’ తుపాన్ పుదుచ్చేరికి సమీపంలో తీరం దాటింది. శనివారం రాత్రి 11 గంటల సమయంలో తీరం దాటినట్టు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఓ ప్రకటనలో తెలిపింది. తుపాన్ పశ్చిమ-నైరుతి దిశగా నెమ్మదిగా కదులుతూ.. క్రమంగా బలహీన పడనుంది. తుపాన్ ప్రభావంతో ఈరోజు దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది. కోస్తాంధ్ర అంతటా వర్షాలు పడే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. తుఫాన్ వల్ల…
ఫెంగల్ తుఫాన్ తీరం వైపు దూసుకొస్తోంది. దాదాప 3-4 గంటల్లో ఫెంగల్ తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. తుఫాను త్వరలో బలహీనపడి నవంబర్ 30 నాటికి తమిళనాడు-పుదుచ్చేరి తీరాల్లో తీవ్ర అల్పపీడనంగా మారుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది
తెలంగాణలో కూడా ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్‌తో వర్షాలు కురవనున్నాయి. నేడు, రేపు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
పెంగల్ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ వెల్లడించిన ప్రకారం, రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో కేంద్ర జల శక్తి శాఖ, పెన్నా పరివాహక ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశాన్ని హెచ్చరించింది.
అలా చేస్తేనే.. మేం కాల్పుల విరమణకు ఒప్పుకుంటాం.. దాదాపు మూడు సంవత్సరాలుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియటం లేదు. అటు కీవ్ సైనికులు కూడా రష్యా దూకుడును ఎదుర్కోలేక దేశం వదిలి పారిపోతున్నారు. ఈ పరిణామాల వేళ కాగా, బ్రిటన్ మీడియా సంస్థ ‘స్కై న్యూస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్‌స్కీ మాట్లాడుతూ.. కీవ్ అధీనంలో ఉన్న భూభాగాన్ని నాటో పరిధిలోకి తీసుకుంటే యుద్ధాన్ని ముగించే అవకాశం ఉందన్నారు. నేటితో ముగియనున్న…
పుదుచ్చేరి, తమిళనాడులోని స్కూల్స్, కాలేజీలు మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. చెన్నై, కడలూరు, విల్లుపురం, కళ్లకురిచ్చి, కాంచీపురం, చెంగల్‌పట్టు, తిరువళ్లూరు, మైలాడుతురై జిల్లాల్లో ఈ రోజు మూతపడ్డాయి.
సంభాల్ వివాదంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని సంభాల్ లో జామా మసీదు దగ్గర సర్వే సమయంలో చెలరేగిన హింస తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో సంభాల్‌లో గల మొఘల్ కాలం నాటి షాహి జామా మసీదును సర్వే చేయాలని జిల్లా కోర్టు నవంబర్ 19న ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ మసీదు నిర్వహణ కమిటీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సివిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల అమలుపై ఏకపక్షంగా స్టే విధించాలని…
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో శుక్రవారం (నవంబర్ 29) అతి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రెడ్ అలర్ట్ ప్రకటించింది.
నేడు ప్రధాని మోడీతో పవన్ కళ్యాణ్ భేటీ.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ఇవాళ (బుధవారం) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పవన్ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఏపీకి రావాల్సిన నిధులు, విభజన అంశాలు, కేంద్ర ప్రభుత్వ సహకారంపై ప్రధానితో ఆయన చర్చించనున్నారు. అలాగే, జలజీవన్ మిషన్ స్కీమ్‌లో భాగంగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన నిధులను సైతం ఇవ్వమని కోరనున్నారు. ఈ పథకాన్ని కొనసాగించాలని కోరే అవకాశం ఉంది.…
ఢిల్లీ: నేడు ఇండియా కూటమికి చెందిన భాగస్వామ్యపక్షాల ఫ్లోర్ లీడర్ల సమావేశం. ఉదయం 10 గంటలకు పార్లమెంట్ భవన్‌లో ఇండి కూటమి భాగస్వామ్యపక్షాల ఫ్లోర్ లీడర్ల భేటీ. అదానీపై అమెరికా చేసిన నేరారోపణలపై విచారణ జరిపేందుకు ‘సంయుక్త పార్లమెంటరీ కమిటీ’ని ఏర్పాటు చేయాలంటున్న భాగస్వామ్యపక్షాలు. డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్లపై నేడు ఏపీ హైకోర్టులో విచారణ. చంద్రబాబు, పవన్‌పై అసభ్యకర పోస్టుల కేసులో ముందస్తు బెయిల్ కోరిన ఆర్జీవీ. అత్యవసరంగా విచారణ జరపాలని విజ్ఞప్తి…