ఈనెల 17న తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు. ఈ నేపథ్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలని టీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. ఈ ఏడాది సీఎం కేసీఆర్ 68వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రదాత కేసీఆర్ జన్మదిన సంబరాలను మూడురోజుల పాటు ఘనంగా నిర్వహించుకుందామని టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఎవరికి తోచిన మేరకు వారు తమ సేవా దృక్పథాన్ని చాటుకునేలా ఈ సంబరాలు ఉండాలని కేటీఆర్ సూచించారు.…
తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విభజన అనంతరం పరిష్కారం కాకుండా మిగిలిపోయిన సమస్యలపై కేంద్ర హోంశాఖ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. విభజన సమస్యల పరిష్కారం కోసం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి నేతృత్వంలోని ఈ కమిటీ సమావేశం నిర్వహించనుంది. ఈ నెల 17న ఉదయం 11 గంటలకు కమిటీ తొలి భేటీ నిర్వహిస్తామని కేంద్రం ప్రకటించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగనున్న…