మేఘాలయ క్రికెటర్ ఆకాష్ కుమార్ చౌదరి వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ బాదాడు. సూరత్‌లోని పితావాలా స్టేడియంలో అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూప్ మ్యాచ్‌లో ఆకాష్ 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. ఇది రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ కూడా. ఈ క్రమంలో వేన్ వైట్ రికార్డును ఆకాష్ బద్దలు కొట్టాడు. 2012లో ఎసెక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లీసెస్టర్‌షైర్ తరఫున…
టెస్ట్ క్రికెట్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన ఆటగాళ్లలో ఒక్క భారత ఆటగాడి పేరు లేదు. వీరేంద్ర సెహ్వాగ్, రిషబ్ పంత్ వంటి భారీ హిట్టర్స్ ఉన్నప్పటికీ.. టెస్టుల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన జాబితాలో లేరు. భారత ఆటగాళ్ల పేరిట ఎన్నో అరుదైన రికార్డులున్నప్పటికీ, ఈ రికార్డు లేకపోవడం గమనార్హం.
ఐపీఎల్ 2024లో భాగంగా.. సన్ రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు.. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించారు. ఓపెనర్లుగా బరిలోకి దిగిన మయాంక్ అగర్వాల్ (11) పరుగులు చేసి ఔట్ కాగా... మరో బ్యాటర్ ట్రేవిస్ హెడ్ కేవలం 24 బంతుల్లో 62 పరుగులు చేశారు.
Steve Stolk Hits Fastest Fifty in ICC Under 19 World Cup 2024: దక్షిణాఫ్రికా ఓపెనింగ్ బ్యాటర్ స్టీవ్ స్టోల్క్ సంచలనం సృష్టించాడు. ఐసీసీ అండర్-19 ప్రపంచకప్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. శనివారం స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 17 ఏళ్ల స్టీవ్ స్టోల్క్ 13 బంతుల్లో అర్ధ సెంచరీ బాదాడు. ఈ మ్యాచ్‌లో స్టోల్క్ మొత్తంగా 37 బంతుల్లో 8 సిక్సులు, 7 ఫోర్లతో ఏకంగా 86 రన్స్…
వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా ఈరోజు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో న్యూజిలాండ్-శ్రీలంక మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో శ్రీలంక ముందుగా బ్యాటింగ్ కు దిగింది. ఈ క్రమంలో శ్రీలంక బ్యాటర్ కుశాల్ పెరీరా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. క్రీజులో ఉన్నంతసేపు కివీస్ బౌలర్లకు పెరెరా చుక్కలు చూపించాడు. కేవలం 22 బంతుల్లోనే 9 ఫోర్లు, 2 సిక్స్‌లు కొట్టి అర్ధసెంచరీ సాధించాడు.