Steve Stolk Fastest Fifty: 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. రిషబ్ పంత్ రికార్డు బద్దలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Steve Stolk Hits Fastest Fifty in ICC Under 19 World Cup 2024: దక్షిణాఫ్రికా ఓపెనింగ్ బ్యాటర్ స్టీవ్ స్టోల్క్ సంచలనం సృష్టించాడు. ఐసీసీ అండర్-19 ప్రపంచకప్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. శనివారం స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 17 ఏళ్ల స్టీవ్ స్టోల్క్ 13 బంతుల్లో అర్ధ సెంచరీ బాదాడు. ఈ మ్యాచ్‌లో స్టోల్క్ మొత్తంగా 37 బంతుల్లో 8 సిక్సులు, 7 ఫోర్లతో ఏకంగా 86 రన్స్ చేశాడు. స్టోల్క్ విజృంభణతో దక్షిణాఫ్రికా సునాయాస విజయాన్ని అందుకుంది.
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ రికార్డును స్టీవ్ స్టోల్క్ బద్ధలు కొట్టాడు. బంగ్లాదేశ్‌లో జరిగిన ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ 2016లో నేపాల్‌పై పంత్ 18 బంతుల్లో అర్ధ శతకం చేశాడు. తాజాగా పంత్ రికార్డును స్టోల్క్ బ్రేక్ చేశాడు. స్టోల్క్ ఒకే ఓవర్‌లో ఐదు సిక్సర్లతో పాటు బౌండరీ బాది ఏకంగా 34 పరుగులు పిండుకున్నాడు. అండర్ 19 ప్రపంచకప్ చరిత్రలోనే ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా మరో రికార్డు నెలకొల్పాడు. స్కాట్లాండ్ బౌలర్ ఖాసిమ్ ఖాన్.. స్టోల్క్ ఊచకోతకు బలయ్యాడు.
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
Also Read: IND vs ENG: రవీంద్ర జడేజా ఖాతాలో అరుదైన రికార్డు!
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ టీమ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 269 పరుగులు చేసింది. జామియా డంక్ (90; 121 బంతుల్లో 11 ఫోర్లు), ఓవెన్ గౌల్డ్ (97; 89 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. అనంతరం లక్ష్య చేధనకు దిగిన దక్షిణాఫ్రికా స్టీవ్ స్టోల్క్ విధ్వంసంతో 27 ఓవర్లలోనే 3 వికెట్లకు 273 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. దీవాన్ మరైస్ (80), డేవిడ్ తీగర్ (40) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!