భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ అద్భుతంగా బౌలింగ్ చేసి వరల్డ్ రికార్డు సాధించాడు. ఈ మ్యాచ్‌లో అతను మూడో వికెట్ సాధించిన వెంటనే అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో అతి తక్కువ బంతుల్లో 200 వికెట్లు తీసిన బౌలర్‌గా ఒక కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ రికార్డుతో ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్‌ను అధిగమించాడు.