Sandra Venkata Veeraiah: కీర్తి వస్తే వాళ్ళది.. అపకీర్తి వస్తే మాదని అన్నటు చేస్తున్నారు ఈ మంత్రులు అని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
T. Harish Rao: రైతు రుణ మాఫీపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. యాదగిరిగుట్ట హరిత టూరిజం హోటల్ లో..
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వినయ పూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నానని.. అధికారం కోసం, అధికారం కోల్పాయి కొద్ది మంది దుర్బుద్ధితో రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రుణమాఫీ అంశంలో ప్రస్తుతం అధికార-ప్రతిపక్షాల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధంపై ఆయన స్పందించారు.
Shabbir Ali Comments on Harish Rao: రైతు రుణమాఫీపై బీఆర్ఎస్‌కు మాట్లాడే అర్హత లేదని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. హరీశ్‌రావు ఎప్పుడు రాజీనామా చేస్తారో? చెప్పాలన్నారు. రుణమాఫీ చేయడం బీఆర్ఎస్‌కు ఇష్టం లేదని, అందుకే అవాకులు చెవాకులు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రుణమాఫీ సందర్భంగా కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డిలో కాంగ్రెస్ రైతుర్యాలీ నిర్వహించింది. రుణమాఫీ సంబరాల్లో భాగంగా రైతు వేదిక వద్ద సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ప్రభుత్వ…
పాస్ బుక్ ఆధారంగానే రుణమాఫీ చేస్తామని.. రేషన్ కార్డుకు సంబంధం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కుటుంబాన్ని నిర్ధరించేందుకే రేషన్ కార్డు అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం రైతులకు తీపికబురు అందించింది. ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి దఫాలో రూ.లక్ష వరకు రుణం పొందిన రైతుల ఖాతాల్లో రుణమాఫీ మొత్తాన్ని జమ చేసింది.
Mahesh Kumar Goud: 2 లక్షల రూపాయల రైతు రుణ మాఫీ చారిత్రక నిర్ణయమని ఎమ్మెల్సీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రి వర్గం సమావేశం జరిగింది.
Ponnam Prabhaker: ఆగస్టు 15 లోపు 2లక్షల రైతు రుణ మాఫీ చేస్తాం వచ్చే వానాకాలం పంటకు 500 బోనస్ ఇస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
Farmers Loan: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల రుణమాఫీని పునఃప్రారంభించాలని నిర్ణయించారు. నేటి నుంచి రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని పునఃప్రారంభించాలని మంత్రి హరీశ్‌రావుతో పాటు కార్యదర్శి రామకృష్ణారావును సీఎం కేసీఆర్ ఆదేశించారు.