తెలంగాణ రైజింగ్.. ఆ కోణంలో బ్యాంకర్లు దీర్ఘ దృష్టితో ఆలోచించి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రజాభవన్‌లో జరిగిన బ్యాంకర్స్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి అనుమతులు వచ్చాయని.. త్వరలో టెండర్లు పిలుస్తామని ఆయన తెలిపారు.
Revanth Reddy On Rythu Bharosa: తెలంగాణ రాష్ట్రంలో రైతుల సంక్షేమం తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా పథకం గురించి తన అభిప్రాయాలను పంచుకున్నారు. రైతు భరోసా పథకంపై వివిధ అంశాలను ఆయన వెల్లడించారు. రైతు భరోసా పై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని, ఇందిరాగాంధీకి ఉన్న చరిత్ర అందరికీ తెలుసునని అన్నారు. రైతు బందు ఉద్దేశం వ్యవసాయ పెట్టుబడికి సహాయం చేయడమని ఆయన అన్నారు. గత ప్రభుత్వం రైతు…
ఈ-ఫార్ములా కార్ రేసింగ్ అంశంపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. దమ్ముంటే ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని ఆయన సవాల్ విసిరారు. రాష్ట్రంలోని అన్ని సమస్యలపై చర్చించేందుకు సిద్ధమని వెల్లడించారు. కేబినెట్‌లో మాట్లాడటం సరికాదని.. సభలో చర్చ చేద్దామంటూ కేటీఆర్ పేర్కొన్నారు. ఈ-కార్ రేసింగ్‌పై విచారణకు గవర్నర్ ఆమోదంపై కేటీఆర్ తొలిసారి స్పందించారు.
Bhatti Vikramarka : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కాలం పూర్తి చేసుకున్న నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన విజయోత్సవాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా సోమవారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ మార్గ్ లో హెచ్ఎండీఏ గ్రౌండ్స్ లో ఆరోగ్య ఉత్సవాలు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. పెద్దయెత్తున ఉద్యోగ నియామకాలు చేపడుతూ… నియామక పత్రాలు అందించడం… ఆనందంగా ఉందన్నారు. బడుగు, బలహీన వర్గాల అవసరాల ను…
CM Revanth Reddy : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కాలం పూర్తి చేసుకున్న నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన విజయోత్సవాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా సోమవారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ మార్గ్ లో హెచ్ఎండీఏ గ్రౌండ్స్ లో ఆరోగ్య ఉత్సవాలు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి 213 అంబులెన్స్ లకు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. వైద్య ఆరోగ్య శాఖ..…
ఉచిత బస్సు పథకం తెలంగాణ మహిళలకు మరింత ఉపయోగకరంగా మారిందని మంత్రి సీతక్క చెప్పారు. మంగళవారం హనుమకొండలో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభలో ఆమె ప్రసంగిస్తూ, ఈ పథకంపై విపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయనే ఆరోపణ చేశారు.
హన్మకొండ ప్రజా పాలన-ప్రజా విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇందిరమ్మ అంటే ప్రపంచ దేశాలకు ఉక్కు మహిళ అని కొనియాడారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలను కోటీశ్వరులు చేయాలని ఉక్కు సంకల్పంతో ఉన్నామని, ఆడబిడ్డల ఆశీర్వాదంతోనే నేను సీఎం అయ్యానని ఆయన అన్నారు.
రాహుల్ గాంధీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై తీసుకున్న చర్యల గురించి హైదరాబాద్ పర్యటనలో మాట్లాడాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పారు.
ఇవాళ ఆయన ఎన్టీవీతో ముఖాముఖి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిననాడే చావు తెగించి వచ్చామని, ఉద్యమ సమయంలో చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి లాంటి పెద్ద పెద్ద నాయకులతో కొట్లాడినమని ఆయన అన్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని నడుపుతున్న చిట్టినాయుడి అని, ఆ చిట్టినాయుడు ఏదో కేసు పెడుతా.. అది చేస్తా.. ఇది చేస్తా అంటే భయపడేది లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
Ponnam Prabhakar: రైతులు పంటలకోసం తీసుకున్న రుణాలు మాత్రమే మాఫీ అవుతాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రుణమాఫీ విషయంలో ప్రతిపక్షాలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.