Rahul Gandhi: "వ్యవసాయ చట్టాలను" వ్యతిరేకించినందుకు దివంగత బీజేపీ నేత అరుణ్ జైట్లీ తనను బెదిరించాడని రాహుల్ గాంధీ అన్నారు. తనను బెదిరించడానికి బీజేపీ జైట్లీని తన వద్దకు పంపిందని శనివారం ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ ఆరోపణల్ని బీజేపీ తిప్పికొట్టింది.ఆ సమయంలో అరుణ్ జైట్లీ బతికేలేరనే విషయాన్ని కాంగ్రెస్ నేత మరిచిపోయారని ఎద్దేవా చేసింది.