ఓ వైపు అల్లుడిని కోల్పోయిన బాధ వారిని వెంటాడుతూనే ఉంది.. ఇప్పుడు కూతురు కూడా కోలుకోలేని స్థితికి వెళ్లిపోయింది.. అయితే, ఆ దుఃఖాన్ని దిగమింగుతూ పలువురు జీవితాల్లో వెలుగు నింపారు.. ఇంకా కొందరికి ప్రాణదానం చేశారు.. ఆ దంపతులు.. కర్నూలుకు చెందిన పావని లత అనే మహిళ బ్రెయిన్ డెడ్ కావడంతో కిడ్నీలు, కాలేయం, మూత్రపిండాలు, కళ్లు.. ఇలా అవయవాలను దానం చేశారు.
ఈరోజు అయోధ్యలో జరిగిన రామ్ లల్లా ప్రాణప్రతిష్ట మహోత్సవానికి ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ తన కుటుంబంతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా.. ఆయన అయోధ్యలోని రామమందిర ట్రస్ట్‌కు రూ.2.51 కోట్లు విరాళంగా అందజేశారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు ముఖేష్ అంబానీ తన కుటుంబ సభ్యులతో కలిసి రూ. 2.51 కోట్లు విరాళంగా ఇచ్చారని కుటుంబ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. ముఖేష్ అంబానీ తన భార్య నీతా, కుమార్తె ఇషా,…
సంక్రాంతి అల్లుడికి మర్యాదలు చేయడంలో గోదావరి జిల్లాలు స్పెషల్ అనుకుంటే అంతకంటే సూపర్ అంటున్నారు అనకాపల్లికి చెందిన అత్తమామలు. కొత్త అల్లుడికి పొట్టపగిలిపోయేలా విందు భోజనం ఏర్పాటు చేసి ఔరా..! అనిపించారు.
కర్నూలు జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటించారు. మంత్రాలయం నియోజకవర్గం పెదకడుబూరులో "నిజం గెలవాలి" యాత్రలో ఆమె పాల్గొన్నారు. అందులో భాగంగా.. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెనొప్పితో చనిపోయిన గోనేభావి గోపాల్ కుటుంబాన్ని పరామర్శించి, అతని చిత్ర పటానికి నివాళులు అర్పించారు. అనంతరం.. అతని కుటుంబానికి రూ. 3 లక్షలు ఆర్థిక సహాయం అందించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో కార్యకర్తలు మరణించడం బాధాకరమన్నారు. కార్యకర్తల మృతితో చంద్రబాబు ఎంతో బాధపడ్డారని.. ప్రతి…
మాజీమంత్రి దాడి ఫ్యామిలీ వైసీపీకి గుడ్ బై చెప్పింది. ఈ క్రమంలో.. దాడి వీరభద్రరావు రాజీనామా లేఖను ముఖ్యమంత్రికి పంపారు. తాను, తన అనుచరులతో కలిసి పార్టీ వీడుతున్నట్టు రాజీనామా లేఖలో పేర్కొన్నారు. కాగా.. వైసీపీకి రాజీనామా చేసిన వెంటనే.. దాడి వీరభద్రరావు ఫ్యామిలీ టీడీపీలో చేరనున్నట్లు సమాచారం అందుతోంది. రేపు చంద్రబాబుతో దాడి వీరభద్రరావు అపాయింట్ మెంట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
పంజాబ్ లో న్యూ ఇయర్ వేళ విషాదం నెలకొంది. జలంధర్ జిల్లా అదంపూర్లోని ఒక గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు తమ ఇంట్లో శవమై కనిపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అనకాపల్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తెనాలికి చెందిన కుటుంబంలోని ఐదుగురు ఆత్మహత్యాయత్నం చేయగా.. నలుగురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.