ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లి ట్రాప్ అయ్యాడు..!! అదృష్టం బాగుండి కొన్నాళ్లకు తిరిగొచ్చాడు. తనలా మరొకరు మోసపోకుండా ఉండాలని కోరుకోవాల్సింది పోయి.. ఉద్యోగాల ఆశ చూపి అమాయకులను విదేశాలకు పంపాడు. ఇదీ చాలదన్నట్టు స్టాక్ ట్రేడింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతూ కోట్లు కొల్లగొడుతున్నాడు. ఓ బాధితుడి ఫిర్యాదుతో అడ్డంగా బుక్కై.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు చిక్కాడు.
వృద్ధుడికి మాయమాటలు చెప్పి భారీగా డబ్బులు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు సైబరాబాద్ పోలీసులకు చిక్కారు. టోలిచౌకి ప్రాంతానికి చెందిన 65 ఏళ్ల వృద్ధుడిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. వృద్ధుడి నుంచి రూ. 74.36 లక్షలు కాజేశారు. బాధితుడు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి కావడంతో అతని నమ్మకాన్ని ఆసరాగా చేసుకున్నారు. నకిలీ ట్రేడింగ్ యాప్ లింకులు పంపి పెట్టుబడి పెట్టమని చెప్పి భారీగా మోసానికి పాల్పడ్డారు.