Fake currency: యూట్యూబ్ చూసి నేరగాళ్లు కొత్త రకం నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా యూట్యూబ్ చూసి ఏకంగా ఓ గ్యాంగ్ రూ.500 నోట్లను ముద్రించారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో జరిగింది. నకిలీ నోట్ల తయారీ రాకెట్‌ని నడుపుతున్న ఇద్దరు వ్యక్తులతో పాటు రూ. 30,000 విలువైన ఫేక్ కరెన్సీని పోలీసులు పట్టుకున్నారు.