ఒక దశాబ్దం పాటు అరెస్టు నుంచి తప్పించుకు తిరుగుతున్న ఓ నేరస్థుడిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వేసిన హనీ ట్రాప్‌లో పడ్డాడు. ఒక మేల్ కానిస్టేబుల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో మహిళగా నేరస్థుడికి దగ్గరయ్యాడు. ఈ క్రమంలో నేరస్థుడు చిక్కినట్లు పోలీసులు గురువారం తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని వివిధ పోలీస్ స్టేషన్‌లలో దొంగతనం, అక్రమ ఆయుధాలు కలిగి ఉండటం.. బూట్‌లెగ్గింగ్ వంటి 20 కేసులు నిందితుడు బంటి (45)పై ఉన్నాయి. అయితే అతన్ని…