ఓ కంపెనీకి సంబంధించి నకిలీ భూ పత్రాల సృష్టించి మోసానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శేఖర్ అనే వ్యక్తి హైదరాబాద్‌లోని మూసాపేటలో గల ఓ కంపెనీకి చెందిన స్థలానికి నకిలీ పత్రాలు సృష్టించాడు.
1500 గజాల స్థలానికి ఫేక్ పత్రాలు సృష్టించి ఆ స్థలానికి అమ్ముతానంటూ.. ఓ వ్యక్తి దగ్గరి నుంచి రూ.1.10 కోట్ల రూపాయల అడ్వాన్స్ తీసుకున్నాడు.
నకిలీ పత్రాలుగా గుర్తించిన బాధితుడు.. మోస పోయినట్లు గ్రహించి వెంటనే పోలసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు శేఖర్‌ను అదుపులోకి తీసుకున్నారు.