ఫాఫ్ డుప్లెసిస్ వరుసగా రెండు సీజన్లలో జట్టును నడిపించినా.. ఆశించిన ప్రదర్శన రాలేదు. విరాట్ కోహ్లీ నాయకత్వంలో ఆర్బీసీ 3 సార్లు ప్లే ఆఫ్స్‌లోకి ప్రవేశించగా, ఒకసారి ఫైనల్ ఆడింది. వీటన్నింటినీ పరిశీలిస్తే.. వచ్చే ఐపీఎల్ సీజన్‌లో ఆర్బీబీ ఫ్రాంచైజీ మళ్లీ విరాట్ కోహ్లీకి కెప్టెన్సీని ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు అనే టాక్ వినిపిస్తుంది.
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఆదివారం మధ్యాహ్నం సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ఓపెనర్ విరాట్ కోహ్లీ మరోసారి గోల్డెన్ డకౌట్‌గా వెనుతిరిగాడు. అతడు ఈ టోర్నీలో గోల్డెన్ డకౌట్ కావడం ఇది మూడోసారి. అయితే మరో ఓపెనర్ డుప్లెసిస్ మాత్రం మెరుపు వేగంతో ఆడాడు. 50…