సోషల్ మీడియాలో తరచూ ఏదో ఒకటి వైరల్ అవుతూనే ఉంటుంది. కొన్నిసార్లు ఫిషింగ్ లింక్‌లు కూడా వైరల్ అవుతాయి. ఈ లింక్‌లను క్లిక్ చేయడం వలన వినియోగదారులకు సమస్యలు పెరుగుతాయి. అలాంటి ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ప్రధానమంత్రి ఉచిత రీఛార్జ్ పథకం కింద.. భారతీయ వినియోగదారులందరికీ 3 నెలల ఉచిత మొబైల్ రీఛార్జ్ లభిస్తుందని పేర్కొన్నారు. డిసెంబర్ 30లోపు ఈ రీఛార్జ్‌ని పొందండని రాసుకొచ్చారు. పోస్ట్‌తో పాటు లింక్ కూడా షేర్…
ఇజ్రాయెల్‌పై మంగళవారం ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది. దాదాపు 180 క్షిపణులను ప్రయోగించినట్లుగా తెలుస్తోంది. అయితే కొన్నింటిని గగనతలంలోనే ఇజ్రాయెల్ పేల్చేసింది. మరికొన్ని ఇజ్రాయెల్‌లోని పలు ప్రాంతాలను ధ్వంసం చేశాయి. అయితే మంగళవారం దాడి సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమన్ నెతన్యాహు భయంతో బంకర్‌లోకి పరిగెడుతున్నారంటూ ఇరాన్ అనుకూల సోషల్ మీడియాలో వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చక్కర్లు కొడుతోంది.
Fact-Check: భారత్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజార్ పాకిస్తాన్‌లో గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో చనిపోయాడంటూ వార్తలు వస్తున్నాయి. ఇటీవల పాకిస్తాన్ వ్యాప్తంగా భారత వ్యతిరేక ఉగ్రవాదుల్ని ఒక్కొక్కరిగా గుర్తుతెలియని వ్యక్తులు హతమారుస్తున్న నేపథ్యంలో ఇది కూడా నిజమని చాలా మంది భావించారు. ముఖ్యంగా భారత్‌లోని చాలా మంది ఈ వార్తలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. దీనికి ముందు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంపై ఇటీవల విషప్రయోగం జరిగిందని,…
Fact Check: సోషల్ మీడియాలో అసలు ఏదో నకిలీ ఏదో కనిపెట్టడం కష్టంగా మారుతోంది. అయితే కొందరు నకిలీని అసలుగా భావించి వైరల్ చేస్తుండటం హాట్ టాపిక్‌గా మారింది. అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా వీరసింహారెడ్డి విజయోత్సవ సభలో బాలయ్య ఫ్లోలో అన్న మాటను పట్టుకుని ఒక వర్గం అదేపనిగా ట్రోల్ చేస్తోంది. అక్కినేని తొక్కినేని అని మాట్లాడటాన్ని భూతద్దంలో పెట్టి కొందరు విమర్శలు చేస్తున్నారు. ఈ మాటను బాలయ్య కావాలని మాట్లాడారా లేదా అన్న విషయం…
ప్రపంచ దేశాల వెన్నులో వణుకుపుట్టించింది కరోనా మహమ్మారి.. చాలా దేశాలు తేరుకున్నా.. చైనాలాంటి కొన్ని దేశాలు ఇంకా కోవిడ్‌తో సతమతం అవుతూనే ఉన్నాయి.. ఎన్నో రకాల వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వచ్చాయి.. ఫస్ట్ డోస్, సెకండ్ డోస్.. బూస్టర్ డోస్ వరకు వెళ్లింది.. వ్యాక్సిన్ తీసుకున్నవారిలో ఇమ్యూనిటీ లెవల్స్ పెరిగి.. కోవిడ్ నుంచి రక్షణ పొందుతున్నారని కొన్ని అధ్యయనాలు తేల్చితే.. మరికొన్ని స్టడీస్ మాత్రం భయపెడుతున్నాయి.. కరోనాతో బాధపడుతున్న వారిలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని…
ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్లు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా మిగిలిన సేకరణ కూడా జరగాలని సీఎం జగన్ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వ్యవసాయశాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. రైతులకు ఎక్కడా నష్టంలేకుండా చూడాలని సూచించారు. ఇప్పుడున్న ప్రక్రియను మరింత బలోపేతం చేయాలన్నారు. రైతులకు మిల్లర్లతో పని ఉండకూడదు, ధాన్యం కొనుగోలు కేంద్రాలవద్ద విక్రయంతోనే రైతుల పని ముగుస్తుంది, ఆతర్వాత అంతా ప్రభుత్వానిదే బాధ్యత అని గుర్తు చేశారు. రైతులకు ఇబ్బంది…