వ్యాపారులు ఇటీవల కొత్త పంథాలో ఆలోచిస్తున్నారు. తమ బిజినెస్ చక్కగా సాగాలనే ఉద్దేశంతో పాపులర్ అయిన పేర్లను షాపులకు పెట్టుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫేస్‌బుక్ దూసుకుపోతోంది. ప్రతి మొబైల్‌లో ఫేస్‌బుక్ ఉండాల్సిందే. ఈ మధ్య ఫేస్‌బుక్ లైవ్స్, రీల్స్ కూడా నెటిజన్లు చేసేస్తున్నారు. తాజాగా బెంగళూరుకు చెందిన వ్యాపారి ఫేస్‌బుక్ పేరును వాడి లబ్ధి పొందాలని ప్రయత్నించాడు. అచ్చంగా అదే పేరు పెడితే కేసు అవుతుందని భావించి తన బేకరీకి ‘ఫేస్ బేక్’ అని పేరు…