అఫ్ఘానిస్తాన్ రాజధాని కాబూల్‌లోని రష్యా రాయబార కార్యాలయం సమీపంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో పది మంది మృతిచెందారు. ఈ పేలుడులో ఇద్దరు రష్యా రాయబార కార్యాలయ సిబ్బంది మరణించినట్లు రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. మరో 8 మంది గాయపడినట్లు సమాచారం.
తెలంగాణలో వరుసగా ఎలక్ట్రిక్ వాహనాల పేలుడు వాహనదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఓవైపు ఇంధన ధరల పెరుగుదల.. మరోవైపు పర్యావరణ హితం కోసం ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తే ఇలాంటి ఘటనలు వాటిని కొనుగోలు చేయాలనుకున్న మిగతా వారిలో భయాన్ని పుట్టిస్తున్నాయి. తాజాగా తెలంగాణలోని సిద్దిపేట జిల్లా దుబ్బాక మండంల పెద్ద చీకోడు గ్రామంలో ఛార్జింగ్ పెట్టిన ఓ ఎలక్ట్రిక్ వాహనంలో బ్యాటరీ పేలింది. ఈ ఘటనలో ఎవరికీ ఏం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక…
పాకిస్తాన్‌లోని కరాచీలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. కరాచీలో నిత్యం రద్దీగా ఉండే షేర్షా పరాచా చౌక్‌లోని ఓ భవనంలో పేలుడు సంభవించింది. ఈ భారీ పేలుళ్లలో 10 మంది మృతి చెందారు. భారీ పేలుడు ధాటికి పలు భవనాలు ధ్వంసం అయ్యాయి. పెద్ద సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. Read: శాస్త్రవేత్తలను కలవరపెడుతున్న సూపర్ స్ట్రెయిన్…ఆ రెండూ కలిస్తే… మృతుల సంఖ్య పెరిగే అవకాశం…
కరేబియన్ దీవి హైతీలో ఘోరప్రమాదం సంభవించింది. కేప్ హైతియాన్‌లో పెట్రోల్ తీసుకెళ్తున్న ఓ ట్యాంకర్ పేలింది. ఈ ఘటనలో సుమారు 50 మందికి పైగా మృతి చెందారు. వందలాది మందికి గాయాలయ్యాయి. దాదాపు 20 కి పైగా ఇళ్లు మంటల్లో చిక్కుకున్నట్టు స్థానిక డిప్యూటీ మేయర్ పాట్రిక్ పేర్కొన్నారు. మృతుల సంఖ్యను ఇప్పుడే అంచనావేసి చెప్పలేమని, ఇళ్లల్లో ఉండి మరణించిన వారిని గుర్తించాల్సి ఉందని, డిప్యూటీ మేయర్ పేర్కొన్నారు. ఇక ఈ ప్రమాదంపై హైతీ ప్రధాని…
దేశ రాజధాని ఢిల్లీ గురువారం నాడు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అత్యంత కట్టుదిట్టంగా భద్రత ఉండే కోర్టులో పేలుడు సంభవించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఢిల్లీలోని రోహిణి కోర్టులో గురువారం ఉదయం కోర్టు కార్యకలాపాలు జరుగుతున్న సమయంలో ఒక్కసారి పేలుడు చోటుచేసుకుంది. దీంతో కోర్టు పరిసరాల్లో ఉన్న ప్రజలు భయంతో పరుగులు తీశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పేలుడుకు గల కారణాలపై విశ్లేషించారు. ఓ గదిలో ఉన్న బ్యాగులోని ల్యాప్‌టాప్ పేలిందని.. ల్యాప్‌టాప్‌లోని బ్యాటరీలే పేలుడుకు కారణమని…
మరోసారి తమిళనాడులోని శివకాశిలో పేలుడు సంభవించింది.. శివకాశికి సమీపంలోని జమీన్‌సల్వార్‌పట్టి బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుళ్లు జరిగాయి.. పేలుడు ధాటికి భవనం పూర్తిగా ధ్వంసమైంది. ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు.. ఇక, భవనం శిథిలాల కింద దాదాపు 20 మంది ఉన్నట్టుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. బాధితులను వెలికితీసిందుకు సహాయక చర్యలు కొనసాగుతుండగా.. మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉందంటున్నారు.. కాగా, తమిళనాడులోని విరుదునగర్ జిల్లాల్లో ఉన్న శివకాశి ప్రాంతంలో పెద్ద ఎత్తున…