ఇండోనేషియాలోని ఉత్తర సులవేసి ప్రావిన్స్‌లోని రుయాంగ్ అగ్నిపర్వతంలో పేలుడు సంభవించింది. బూడిద, పొగ 19 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న స్ట్రాటో ఆవరణకు చేరుకుంది. సునామీ భయం పుట్టింది. 800 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఎర్ర సముద్రంలో మరో వాణిజ్య నౌకపై గురువారం నాడు హౌతీ తిరుగుబాట దారులు దాడి చేసినట్లు అమెరికా వెల్లడించింది. లైబీరియా జెండాతో ప్రయాణిస్తున్న నౌకపై రెండు బాలిస్టిక్ క్షిపణులను యెమెన్‌లోని హూదేదా నుంచి రెబల్స్ ప్రయోగించినట్లు తెలిపింది.
చర్లపల్లి లో భారీ పేలుడు సంభవించింది. వెంకట్ రెడ్డి నగర్ & మధుసూదన్ రెడ్డి నగర్ లోని అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో నిన్న రాత్రి భారీ శబ్దంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లో పేలుడు చోటు చేసుకుంది.
తమిళనాడులోని అరియలూరు జిల్లాలో సోమవారం (అక్టోబర్ 9) బాణాసంచా ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో 10 మంది మరణించారు. 10 మంది మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సీఎం నగదు సాయం ప్రకటించారు.
Tamilnadu: తమిళనాడులోని మైలాడుతురై జిల్లా తరంగంబాడి తాలూకాలోని తిలయాడి గ్రామంలో బుధవారం బాణాసంచా తయారీ యూనిట్, గోదాములో జరిగిన పేలుడులో నలుగురు వ్యక్తులు మరణించారు.
12 Dead and 60 Injured in Fire at Makhachkala in Russia: రష్యా దక్షిణ ప్రాంతంలోని డాగేస్తాన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఓ గ్యాస్ స్టేషన్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. మరోవైపు దాదాపు 60 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనను రష్యా అధికారులు మంగళవారం తెల్లవారుజామున దృవీకరించారు. డాగేస్తాన్ రాజధాని మఖచ్కలలో ఉన్న ఓ ఫిల్లి�
ఛత్తీస్‌గఢ్‌లోని ఉక్కు ఫ్యాక్టరీలో ఆదివారం పేలుడు సంభవించి కార్మికుడు కాలిపోయి ప్రాణాలు కోల్పోయాడు. రస్మారాలోని రాయ్‌పూర్ స్టీల్ ప్లాంట్‌లో స్టీల్‌ను కరిగించే పని జరుగుతుండగా పేలుడు సంభవించింది.
థాయ్‌లాండ్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. శనివారం థాయ్‌లాండ్‌లోని బాణసంచా గోదాములో పేలుడు సంభవించి తొమ్మిది మంది మరణించగా.. 100 మందికి పైగా గాయపడ్డారని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు.
Tamilnadu : తమిళనాడు రాష్ట్రంలో తీవ్ర విషాదం నెలకొంది. విరుదునగర్ జిల్లా శివకాశిలోని బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు దాటికి ముగ్గురు ప్రాణాలు కోల్పోగా అనేక మందికి గాయాలయ్యాయి.
Italy: ఇటలీ వాణిజ్య రాజధాని మిలన్ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. భారీ పేలుళ్లతో నగరం దద్దరిల్లింది. పలు కార్లు మంటల్లో చిక్కుకున్నాయి. ఉత్తర ఇటలీలోని మిలన్ నగరంలోని గురువారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు ఎలాంటి మరణాలు నమోదు కాలేదని తెలిపారు.