ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ రాజకీయం హాట్ హాట్ గా సాగుతోంది. వైసీపీ నేతలు, మంత్రులు టీడీపీపై విరుచుకుపడుతున్నారు. తాజాగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హాట్ కామెంట్స్ చేశారు. ప్రతిపక్షాలు అబద్ధపు ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం పై నేను కూడా అలాంటి తప్పుడు ఆరోపణలు చేయిస్తా, రాయించ గలుగుతా అన్నారు. కానీ ..అంత నీచంగా దిగజారి రాజకీయం చేయడం మాకు చేతకాదన్నారు. నాపేరు, కొడాలి నాని పేరు లేకపోతే కొన్ని…
ఏపీలో మంత్రి వర్గ విస్తరణకు రంగం సిద్ధమయింది. గురువారం కేబినెట్ భేటీ కానుంది. ఇదే చివరి కేబినెట్ భేటీ అంటున్నారు. ఇంతకుముందే మంత్రి పేర్ని నాని కూడా తన మనసులో మాట బయటపెట్టారు. తాను పార్టీ బాధ్యతల్లో వుంటానని, మంత్రిగా తన అధ్యాయం ముగిసిందన్నారు. ఇదిలా వుంటే ఉత్తరాంధ్రకు చెందిన డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మంత్రివర్గ విస్తరణపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. రెండురోజుల క్రితం ఆయన మాజీ సీఎం చంద్రబాబుని పొగిడేశారు. చంద్రబాబు విజ్ఞత…
మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య శత జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి. తిరుపతిలో కేంద్ర మాజీ మంత్రి , కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్ దామోదం సంజీవయ్య శత జయంతి సందర్భంగా నివాళులర్పించారు. తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవయ్య చేసిన సేవలను శ్లాఘించారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దామోదం సంజీవయ్య ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చారన్నారు చింతా మోహన్. వృధ్ధాప్య ఫించన్లు, అవినీతిపై ప్రత్యేక చట్టం, బలిజ ,కాపులకు రిజర్వేషన్లు ఇచ్చిన…
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత గారపాటి సాంబశివరావు అనారోగ్యంతో మరణించారు. ఆయన వయసు 75 ఏళ్ళు. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా వున్న సాంబశివరావు ఇవాళ ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు మండలం నాయుడుగూడెంలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో వున్న ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. సాంబశివరావు మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘తెలుగుదేశం సీనియర్ నాయకులు, మాజీ మంత్రి గారపాటి సాంబశివరావుగారి మరణం విచారకరం. ప్రజల్లో…
వర్గ విభేదాలు ఆ నియోజకవర్గం టీడీపీలో చిచ్చు పెట్టాయా? కొత్తగా వచ్చే ఇంఛార్జ్‌పై సస్పెన్స్ కొనసాగుతోందా? ప్రస్తుత ఇంఛార్జ్ తగ్గేదే లేదని చెబుతున్నారా? ఇద్దరు మాజీ మంత్రుల ఎత్తుగడ మధ్య టీడీపీ రాజకీయం మలుపులు తిరుగుతోందా? మాజీ మంత్రుల్లో ఎవరి మాట నెగ్గుతుంది?తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ టీడీపీ కొత్త ఇంఛార్జ్ ఎవరు? ఈ విషయంలో టీడీపీ అధిష్ఠానం ఎందుకు సస్పెన్స్ కొనసాగిస్తోంది? ఆ నియోజకవర్గంలోని తెలుగు తమ్ముళ్లకు అర్థం కావడం లేదట. మాజీ ఎమ్మెల్యే పిల్లి…
సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేసిన ఆ నాయకుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా నియోజకవర్గానికే పరిమితం అయ్యారు. మరోసారి కేబినెట్‌లో చోటుదక్కలేదన్న ఆవేదనో ఏమో.. సైలెంట్. ఇప్పుడు గేర్‌మార్చి మాటల తూటాలు పేలుస్తున్నారు. ఎందుకలా? ధర్మాన ప్రసాదరావు కామెంట్స్‌తో అలజడి..!ధర్మాన ప్రసాదరావు. ఆయన మాట్లాడితే ఒక పదం ఎక్కువ తక్కువ ఉండదు. సూటిగా సుత్తిలేకుండా చెప్పేస్తారు. సిక్కోలు జిల్లాలో కీలకనేతగా గుర్తింపు పొందిన ప్రసాదరావు.. చాన్నాళ్లు మంత్రిగా ఉన్నారు. వైసీపీలో చేరి ఎమ్మెల్యే అయ్యాక మరోసారి కేబినెట్‌లో చోటు దక్కుతుందని ఆశించినా..…
ఆ మాజీ మంత్రికి ఎప్పటి లెక్క అప్పుడేనా? ఏ రోటికాడ ఆ పాట పాడతారా? ఇప్పుడు ఉనికి ప్రమాదంలో పడిందని కులం కార్డు ప్రయోగిస్తున్నారా? ఈ మార్పు వెనక రాజకీయ వ్యూహం ఉందా? నాలుగుసార్లు ఎమ్మెల్యే. ఒకసారి ఎంపీ. గతంలో కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు కేబినెట్‌లో మంత్రి. ఇవీ గంటా శ్రీనివాసరావు పొలిటికల్ బయోగ్రఫీలో కీలక అంశాలు. 2019లో ఎమ్మెల్యేగా గెలిచినా.. తాను ఉన్న టీడీపీ అధికారానికి దూరంగా కావడంతో సైలెంట్ అయ్యారు. మధ్యలో గంటా వైసీపీలోకి వెళ్తున్నారని…
టీఆర్ఎస్ నేత, మాజీమంత్రి మహమ్మద్ ఫరీదుద్దీన్ తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం మృతి చెందిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో వున్నారు. వారం కిందటనే కాలేయ శస్త్ర చికిత్స జరిగింది. ఈ క్రమంలో గుండెపోటు రావడంతో ఆయన తిరిగి రాని లోకాలకు చేరారు. ఆయన చివరి క్షణాలకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఆస్పత్రిలో ఆయన అందరికీ చేయి ఊపుతూ కనిపించారు. ఫరీదుద్దీన్ అకాల…
ఆ మాజీ మంత్రి నోట కొత్త పలుకులు వినిపిస్తున్నాయ్. ఎప్పుడూ రాజకీయాలు, ఎత్తుగడలు మాట్లాడే ఆయన.. ఈసారి కులం కెపాసిటీ గురించి చర్చిస్తున్నారు. అదీ ఎన్నికలకు రెండున్నరేళ్ల ముందు నుంచీ. అంతర్మథనంలో ఉన్న సామాజికవర్గానికి దిక్సూచిగా మారాలనే ఆలోచన ఉందా? లేక రాజకీయాల్లో చురుకైన పాత్రకు వేసిన వ్యూహమా? గంటా చూపు జనసేన వైపు అని పుకార్లు షికారు..! గంటా శ్రీనివాసరావు. మాజీ మంత్రి. టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన రెండున్నరేళ్లుగా మౌనంగా ఉంటున్నారు. అధికారం…