కుప్పం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నియమించిన ప్రత్యేక ఎన్నికల అధికారిని తొలగించాలని టీడీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల కమిషన్(ఎస్‌ఈసీ) ను కోరారు. శుక్రవారం టీడీపీ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజా, ఎమ్మెల్సీ అశోక్ బాబులతో కూడిన టీడీపీ బృందం ఎస్‌ఈసీని కలిసింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నామినేషన్ల పర్వంలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని, అధికార పార్టీకి ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని, ప్రతిపక్ష టీడీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా వైసీపీ నేతలు అడ్డుకున్నారని ఆరోపించారు.…
రమ్య మరణం పట్ల సమాజం దిగ్భ్రాంతి చెందింది. ఇంతటి అరాచకం నా రాజకీయం లో చూడలేదు అని మాజీ మంత్రి ఆలపాటి రాజ అన్నారు. ఒక విద్యార్థిని హత్య జరిగితే ఆ కుటుంబాన్ని పరామర్శించిన లోకేష్ పై కేసులా… పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. కేసులు పెట్టిన తీరు కేసుల్లో చెప్పిన సమయానికి పొంతన లేదు. పోలీస్ అధికారులు నిస్పక్ష పాతం గా వ్యవహరించాలి. పోలీస్ లు రక్షకులు గా కాదు భక్షకులు గా మారి పోయారా…