యువతీయువకులు ప్రేమించుకోవడం.. కొంత కాలం కలిసి తిరగడం.. ఆ తర్వాత విడిపోవడం జరుగుతుంటాయి. విడిపోయిన తర్వాత మానసికంగా ఎంతగానో వేదన చెందుతారు. కొంత మంది ప్రేమ విఫలమైందని ప్రాణాలు తీసుకుంటారు.
ప్రేమ అనేది మాటల్లో చెప్పలేని మధురమైన అనుభూతి. అందుకే ప్రేమించడం, ప్రేమించబడడం ఒక వరం లాంటిదన్నారు. రెండు మనసుల కలయికే ప్రేమ. ప్రేమ ఏ క్షణంలో పుడుతుందో ఎవరూ చెప్పలేరు.