యువతీయువకులు ప్రేమించుకోవడం.. కొంత కాలం కలిసి తిరగడం.. ఆ తర్వాత విడిపోవడం జరుగుతుంటాయి. విడిపోయిన తర్వాత మానసికంగా ఎంతగానో వేదన చెందుతారు. కొంత మంది ప్రేమ విఫలమైందని ప్రాణాలు తీసుకుంటారు. ఇంకొందరు లైట్ తీసుకుంటారు. ఇలా ఒక్కొక్క వ్యక్తిని బట్టి పరిస్థితులుంటాయి. అయితే చైనాకు చెందిన ఒక యువకుడు మాత్రం.. మాజీ ప్రియురాలిని మరిచిపోయేందుకు ఒక వింత నిర్ణయం తీసుకున్నాడు. దీంతో పోలీసులు కూడా షాక్ అయ్యారు.
ఇది కూడా చదవండి: Pakistan: భారత్ అంటే తెలిసొచ్చింది.. ‘‘అణు బెదిరింపుల’’పై వెనక్కి తగ్గిన పాకిస్తాన్..
చైనాలోని యుహాంగ్ జిల్లాలోని జియోలిన్ అనే యువకుడి ప్రేమ విఫలమైంది. దీంతో అతడు.. మాజీ ప్రియురాలిని మరిచిపోయేందుకు పర్వతాల్లోకి వెళ్లిపోయాడు. అలా 6 రోజుల పాటు పర్వతాల్లో నడుచుకుంటూ వెళ్లిపోయాడు. అయితే జియోలిన్ సోదరుడు ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. జియోలిన్ మూడు రోజులుగా తమతో సంబంధాలు లేవని ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు జియోలిన్ ఫ్లాట్ ఖాళీగా ఉండడం.. మొబైల్‌ను అక్కడే వదిలేసి వెళ్లిపోయినట్లుగా అధికారులు గుర్తించారు. జూన్ 20 మధ్యాహ్నం అద్దె ఫ్లాట్ నుంచి కాలినడకన వెళ్లిపోయినట్లుగా సీసీ కెమెరాలో గుర్తించారు. మరుసటి రోజు తెల్లవారుజామున చుట్టుపక్కల ఉన్న దలాంగ్ పర్వత ప్రాంతంలో అతని ఆనవాళ్లు కనిపెట్టారు. 100 మందికి పైగా యుహాంగ్ పోలీసులు, అధికారులు, స్థానిక నివాసితులతో భారీ శోధన చేశారు. పోలీసు కుక్కలు , డ్రోన్లు, సోనార్ పరికరాలతో గాలించినా గుర్తుపట్టలేకపోయారు. ఇక జూన్ 26న ఉదయం లినాన్ జిల్లాలోని ఒక పార్కులోని నిఘా కెమెరాలో జియోలిన్ కనిపించాడు. దీంతో స్థానిక అధికారులు అప్రమత్తం అయ్యారు. జియోలిన్‌ను కనుగొన్నప్పుడు చిరిగిపోయిన బట్టలతో కనిపించాడు.
ఇది కూడా చదవండి: Helmets: అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్.. ఈ కంపెనీ క్వాలిటీ హెల్మెట్‌లపై భారీ డిస్కౌంట్..
ప్రేమికురాలిని మరిచిపోయేందుకు జియోలిన్ పర్వతాల్లోకి వెళ్లిపోయాడని పోలీసులు తెలిపారు. మనసు క్లియర్ చేసుకోవడానికే దాదాపు 40 కిలోమీటర్ల దూరం నడిచాడని చెప్పారు. ఆకలి వేసినప్పుడు అడవి పండ్లను తింటూ పర్వత ప్రవాహాల నీరు తాగుతూ ఉండేవాడని తెలిపారు. మొదటి 3 రోజులు తినలేదని.. త్రాగలేదని పేర్కొన్నారు. అనంతరం శరీరం సహకరించకపోవడంతో దిరికిన చోటెల్లా ఆహారం తీసుకున్నట్లు అధికారులు చెప్పారు. ప్రస్తుతం జియోలిన్ ఆరోగ్యం నిలకడగా ఉందని.. పోలీసులతో మాట్లాడిన తర్వాత ఇకపై అంత ఉద్రేకంగా ప్రవర్తించనని హామీ ఇచ్చాడని తెలుస్తోంది.