ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్ల అమలు అంశంపై సుప్రీంకోర్టు రివ్యూ పిటిషన్ దాఖలైంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆ తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ కాంగ్రెస్ నేత జయ ఠాకూర్ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అగ్రవర్ణ పేదలకు (ఈడబ్ల్యూఎస్) రిజర్వేషన్లు అమలు చేస్తూ నిర్ణయం తీసుకుంది.. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, విద్యాసంస్థల్లో ప్రవేశాల్లో ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్ వర్తిస్తుందని స్పష్టం చేసింది.. రూ. 8 లక్షల్లోపు వార్షిక ఆదాయం ఉన్న వారికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు వర్తించని వారికి ఇకపై ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తించనుంది.. ఇక, విద్యా సంస్థల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై కీలక తీసుకుంది తెలంగాణ ఉన్నత విద్యా…