అమృత్ టెండర్లలో అవినీతి జరిగిందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఇప్పటి వరకు మీడియా సమావేశంలో చూపించిన ఆధారాలతో పాటు తన దగ్గర మరిన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. ఆ ఆధారాలను ఇవ్వడానికి కేంద్ర మంత్రి అపాయింట్మెంట్ తీసుకున్నట్లు తెలిపారు.ఈ అమృత్ నిధులు కేంద్రం నుంచి వస్తాయని.. కాబట్టి కేంద్రం వెంటనే చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేశారు. ఈ మేరకు కేటీఆర్ ఢిల్లీకి బయలు దేరారు. అమృత్ టెండర్ల పై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కి ఫిర్యాదు…
విశాఖ రూరల్ తహశీల్దార్ రమణయ్య హత్య కేసులో కీలక ఆధారాలు లభ్యం అయ్యాయి. ఆర్ధిక లావాదేవీలే హత్యకు కారణంగా గుర్తించారు పోలీసులు. రుషికొండలోని అపార్ట్మెంట్స్ లోని ఫ్లాట్ లను 22ఏ నుంచి తప్పించేందుకు ఎమ్మార్వోతో మణికంఠ గంగారాం ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందం మేరకు ఎమ్మార్వో, రియల్టర్ గంగారాం మధ్య ఆర్ధిక లావాదేవీలు జరిగినట్టు పోలీసులు గుర్తించారు. అయితే.. ఇరువురి మధ్య రుషికొండ అపార్ట్మెంట్స్ తో పాటు మరికొన్ని భూ వ్యవహారాల లావాదేవీలు జరిగాయి.
మంత్రి కేటీఆర్ పై నిరాధార వ్యాఖ్యలు చేయొద్దని సిటీ సివిల్ కోర్టు బండి సంజయ్ సహా పలువురికి స్పష్టం చేసింది. ఈ మేరకు కేటీఆర్ వేసిన దావాలో మధ్యంతర ఉత్వర్వులు ఇచ్చింది. సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో మే 12న తనపై నిరాధార ఆరోపణలు చేశారంటూ బండి సంజయ్‌పై మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. దీనిపై విచారణ జరిపిన సిటి సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ ఉత్వర్వులు ఇచ్చింది. కాగా.. మే 12న…
ఖమ్మం జిల్లాలో బీజేపీ కార్యకర్త వ్యవహారం సంచలనంగా మారిపోయింది… నిత్యం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటూ.. సోషల్‌మీడియాలోను ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పోస్టులు పెడుతుంటాడు సాయి గణేష్… వచ్చే నెల నాలుగో తేదీన పెళ్లి జరగాల్సి ఉంది.. కానీ, ఇంతలోనే ఆత్మహత్యాయత్నం చేశాడు. చివరికి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సాయి గణేష్ చనిపోవడంతో.. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ సాయి గణేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి…