KTR: అమృత్ టెండర్లలో అవినీతి జరిగిందన్న కేటీఆర్.. ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీకి పయనం
- అమృత్ టెండర్లలో అవినీతి జరిగిందన్న కేటీఆర్
- కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు పయనం
- అమృత్ నిధులు కేంద్ర నుంచి వస్తాయన్న మాజీ మంత్రి
- అందుకే కేంద్రానికి ఫిర్యాదు చేయనున్నట్లు ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమృత్ టెండర్లలో అవినీతి జరిగిందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఇప్పటి వరకు మీడియా సమావేశంలో చూపించిన ఆధారాలతో పాటు తన దగ్గర మరిన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. ఆ ఆధారాలను ఇవ్వడానికి కేంద్ర మంత్రి అపాయింట్మెంట్ తీసుకున్నట్లు తెలిపారు.ఈ అమృత్ నిధులు కేంద్రం నుంచి వస్తాయని.. కాబట్టి కేంద్రం వెంటనే చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేశారు. ఈ మేరకు కేటీఆర్ ఢిల్లీకి బయలు దేరారు. అమృత్ టెండర్ల పై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
READ MORE: Minister Satya Kumar Yadav: బడ్జెట్‌లో వైద్యారోగ్య శాఖకు కేటాయింపులపై మంత్రి సత్యకుమార్ యాదవ్ హర్షం
Also Read
- AP Mayor Reservations: ఏపీ మేయర్ రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే
- CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
- Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
- Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
కాగా.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు సృజన్ రెడ్డి ఇటీవల లీగల్ నోటీసులు జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం శోభ కన్స్ట్రక్షన్‌కు ఇచ్చిన అమృత్ పథకం టెండర్లలో అవినీతి జరిగిందని చేసిన ఆరోపణలపై ఈ నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. కాగా కొద్ది రోజుల క్రితం.. తెలంగాణ ప్రభుత్వం అమృత్ టెండర్లలో అవినీతికి పాల్పడుతోందని ఆరోపిస్తూ వెంటనే విచారణ చేపట్టి.. నిజాలను బహిర్గతం చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఇదే విషయంపై కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ కట్టర్, టోచన్ సాహూలకు గత శుక్రవారం లేఖలు రాశారు. కేంద్రం అమృత్ పథకం ద్వారా రాష్ట్రానికి కేటాయించిన నిధుల్లో దాదాపు రూ.1500 కోట్ల టెండర్లు సీఎం సొంత బావమరిది సృజన్ రెడ్డికి చెందిన శోధ కంపెనీకి అర్హతలు లేకున్నా కట్టబెట్టారని.. వెంటనే ఈ ఆరోపణలపై కేంద్రం విచారణ జరిపి నిజాలను నిగ్గు తేల్చాలని కోరారు. కాగా ఈ ఆరోపణలపై సృజన్ రెడ్డి కేటీఆర్‌కు లీగల్ నోటీసులు జారీ చేశారు. సోషల్ మీడియా, వెబ్ సైట్ నుంచి కంటెంట్ తొలగించాలని, బహిరంగ క్షమాపణలు చెప్పాలని సృజన్ రెడ్డి నోటీసుల్లో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
-
Mythri Movie Makers: మెగా ఫిల్మ్ స్టూడియో.. మైత్రీ మూవీ మేకర్స్ మాస్టర్ ప్లాన్ ఇదేనా?
-
El Nino: ఎల్‌నినో ఎఫెక్ట్.. రంగంలోకి సీఎస్.. రైతులతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్
-
Pollution: దగ్గు, జలుబు తగ్గడంలేదా? కారణాలు ఇవే కావచ్చు!
-
El Nino: ఎల్‌నినోతో భూమికి భారీ ముప్పు.. బద్దలుకానున్న రికార్డులు!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!