దేశీయ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు క్రమేణా ఆదరణ పెరుగుతోంది. ఈ క్రమంలో వాహనదారులను ఆకట్టుకునేందుకు ఆయా సంస్థలు ఈవీలపై గట్టిగానే దృష్టి పెడుతున్నాయి. ఎలక్ట్రిక్ టూవీలర్లతోపాటు ఎలక్ట్రిక్ కార్ల వినియోగం సైతం పుంజుకుంటోంది. అందుకే టాటా, మహీంద్రా వంటి దేశీయ సంస్థలతోపాటు హ్యుందాయ్, కియా, ఎంజీ తదితర విదేశీ కంపెనీలూ భారతీయ మార్కెట్‌కు తమ ఎలక్ట్రిక్ కార్లను పరిచయం చేస్తున్నాయి.