నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ అంశంపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. అబద్ధాల పునాదులతో అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తోందన్నారు. దిలావర్ పూర్-గుండంపల్లి మధ్యలో ఇథనాల్ ఫ్యాక్టరీపై కుట్ర జరుగుతోందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే ఇథనాల్ ఫ్యాక్టరీకి అన్ని రకాల అనుమతులు వచ్చాయని చెప్పారు.
Narayanpet Incident: ఇథనాల్ ఫ్యాక్టరీ వివాదంపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. గత ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను పునఃపరిశీలించాలని నిర్ణయించింది. అంతేకాదు తక్షణమే నిర్ణయం తీసుకోవాలని తెలిపింది.