రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్ గిరి బిజెపి అభ్యర్ధిగా ఈటల రాజేందర్ పేరును అధినాయకత్వం ఖరారు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈటలకి అభిమానుల తాకిడి ఎక్కువ అయ్యింది. బీజేపీ నేతలు, కార్యకర్తలు, ఈటల అభిమానులతో షామీర్ పేటలోని ఈటల నివాసం సందడిగా మారింది. పెద్ద ఎత్తున తరలివచ్చి అభినందనలు తెలిపారు. ఈ సారి గెలుపు మీదే అంటూ భరోసా ఇచ్చారు. శాలువాలు కప్పి సత్కరించారు. మోదీ గారినీ ప్రధానమంత్రిని చేసేందుకు మల్కాజ్గిరి నుండి ఈటలను గెలిపించే…
ఆ బీజేపీ ముఖ్యనేత ఐ వాంట్ టు ఫాలో.. ఫాలో అంటున్నారా? ఆ… అయ్యేదేదో సొంత పార్టీ వాళ్ళని కాకుండా రాజకీయ ప్రత్యర్థుల్ని ఫాలో అవ్వాలనుకుంటున్నారా? వాళ్ళు వీళ్ళు అయితే… కిక్కేముంటుంది… మన రేంజ్‌కి తగ్గట్టు ఏకంగా సీఎం రేవంత్‌రెడ్డినే అనుకరిద్దామనుకుంటున్నారా? కాలం, ఖర్మం కలిసొస్తే రేవంత్‌లాగే తానూ అదో ఒక రోజున సీఎం అవ్వొచ్చని కలలుగంటున్నారా? ఇంతకీ ఎవరా లీడర్? ఏంటాయన కథ? పోగొట్టుకున్న చోటే వెదుక్కోమన్నది పెద్దల మాట. కానీ… అన్ని చోట్ల, అన్ని…
కాడెడ్లలా కలిసి నడవాల్సిన, పార్టీని నడిపించాల్సిన వాళ్ళు కీచులాటలకు దిగుతున్నారు. కేరాఫ్ కలహాల కాపురంలా మారిందట వారి వ్యవహారం. నాకు ఒక కన్ను పోయినా ఫర్వేదు… ఎదుటివాడికి రెండు కళ్ళు పోవాలన్న సిద్ధాంతంతో పనిచేసిన ఇద్దరూ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. చివరికి సవతి ముండమోయాలన్నట్టుగా మారిందట ఇద్దరి వ్యవహారం. ఎవరా ఇద్దరు నేతలు? ఏంటి వాళ్ళ కీచులాట కహానీ? ఎంపీ బండి సంజయ్, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ల మధ్య విభేదాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గే సూచనలైతే…
పలు రాష్ట్రాలకు భారీ వర్షసూచన.. లిస్ట్ ఇదే! దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షంతో పాటు వడగండ్లు పడే అవకాశం ఉందని సూచించింది. ఈ మేరకు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు వాతావరణ శాఖ వార్నింగ్ (Warning) ఇచ్చింది. మార్చి 1 నుంచి 3 వరకు భారీ వర్షాలు (Rainfall) కురుస్తాయని పేర్కొంది. జమ్మూకాశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్‌లో భారీ వర్షాలతో పాటు మంచు…
కేసీఆర్ ఇచ్చిన హామీలు, అమలుచేయడంలో విఫలం అయ్యారని, కేసీఆర్ అబద్దాలకంటే ఎక్కువ అబద్దాలు చెప్పే సీఎం రేవంత్ అని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. ఇవాళ రాజరాజేశ్వరి క్లస్టర్ లో జరుగుతున్న విజయ సంకల్ప యాత్రలో రామాయంపేటలో ఈటల రాజేందర్, బోడిగ శోభ, రాణి రుద్రమ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. రేవంత్ హామీ మేరకు ఒకే ఏడాది ఒకే దఫా రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తే రాజకీయాలనుండి తప్పుకుంటా అని…
వచ్చే పార్లమెంట్ ఎన్నికల గురించి మాజీ మంత్రి ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్‌లో సిట్టింగ్ ఎంపీ ఉన్నారు కాబట్టి తాను టికెట్ ఆశించడం లేదని ఆయన చెప్పారు. కరీంనగర్ జిల్లా ఇళ్ళందకుంట మండలం లక్ష్మాజిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. తనకు మల్కాజిగిరి ఎంపీ టికెట్ ఇవ్వమని అధిష్ఠానాన్ని కోరినట్లు తెలిపారు.
BJP: పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ దృష్టి సారించింది. అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం తర్వాత ప్రధాని మోదీ తెలంగాణకు రానున్నారు. తెలంగాణలో ఎన్నికల సభలు జరగనున్నాయి.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. తమకు వచ్చిన ఓట్లు, సీట్లు చూస్తే రాబోయే కాలంలో బీజేపీ తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో అధికారం సాధించే దిశలో పయనిస్తుందని తెలిపారు. డబ్బు, మద్యం ప్రభావంను పక్కన పెట్టి ప్రజలు బీజేపీకి విజయాన్ని కట్ట బెట్టారని అన్నారు. బీజేపీకి ఓటు వేసిన ప్రజలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు శాతం…
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి ఘన విజయం సాధించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుజారాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కౌశిక్ రెడ్డి.. బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్పై 17,158 ఓట్ల మెజారిటీతో గెలిచారు. దాంతో ఇక్కడ ‘శవయాత్ర’ తప్పింది. ప్రచారంలో కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ తాను ఓడిపోతే హుజారాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ తన శవయాత్రకు రావాలని కోరిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారం చివరి రోజున పాడి…