Etela Rajender : తెలంగాణలో మూడో వంతు జనాభాను జీహెచ్‌ఎంసీ పాలిస్తుందని, రాజకీయాలకు అతీతంగా ప్రజల బాధ్యతను తీసుకోవాలన్నారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాస మారింది. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. సంకుచితత్వానికి పోకుండా అవసరమైన చోట నిధులు ఇవ్వాలన్నారు. నగరంలోని కనీస సౌకర్యాలకు నోచుకొని ప్రాంతాలపై దృష్టి పెట్టాలన్నారు. బడ్జెట్ ఎంత, ఖర్చులు, రాబడి అనేది పక్కన పెట్టి సమస్యలపై దృష్టి పెట్టకపోతే నగరం మసకబారుతుందని ఆయన అన్నారు.…
వచ్చే పార్లమెంట్ ఎన్నికల గురించి మాజీ మంత్రి ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్‌లో సిట్టింగ్ ఎంపీ ఉన్నారు కాబట్టి తాను టికెట్ ఆశించడం లేదని ఆయన చెప్పారు. కరీంనగర్ జిల్లా ఇళ్ళందకుంట మండలం లక్ష్మాజిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. తనకు మల్కాజిగిరి ఎంపీ టికెట్ ఇవ్వమని అధిష్ఠానాన్ని కోరినట్లు తెలిపారు.
Etela Rajender: ఉపఎన్నికల్లో కేసీఆర్ చాపను రాకినట్టు రాకిండని బీజేపీ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ అభ్యర్థి ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బ్రాహ్మణపల్లిలో ఎన్నికల ప్రచారంలో ఈటల మాట్లాడుతూ..
Etala Rajender: కాళేశ్వరం అన్ని పిల్లర్ లను చెక్ చేస్తే తప్ప ప్రాజెక్ట్ ఉంటుందా లేదా అనేది తేలుతుందని బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కరీంనగర్ మట్టికి మొక్కి, మీ ఆశీర్వాదంతో... కేసీఆర్ ప్రభుత్వాన్ని బొందపెట్టాలని, ఈ ముగింపు సభను పెట్టుకున్నామని ప్రజలనుద్దేశించి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్‌లో బీజేపీ 5వ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ సందర్భంగా ఈటల మాట్లాడారు.
కాళేశ్వరం పంప్ హౌజ్‌ల ముంపుకు కేసీఆర్ బాధ్యత వహించాలని భాజపా నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చెప్పారు. కాళేశ్వరం వచ్చి కన్నీళ్లు తెచ్చింది అని రైతులు ఏడుస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నీటిపారుదల శాఖకు మంత్రి లేకపోవడం, సీజన్‌లో అధికారులు విదేశీ పర్యటనకు వెళ్లడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఈటల విమర్శించారు.