Etala Rajender: కాళేశ్వరం అన్ని పిల్లర్ లను చెక్ చేస్తే తప్ప ప్రాజెక్ట్ ఉంటుందా లేదా అనేది తేలుతుందని బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఇంతకు ముందు కట్టిన ప్రాజెక్ట్ లు ఏవి దెబ్బ తినలేదని గుర్తు చేశారు. కానీ కేసీఆర్ సర్కార్ నిర్మించిన కాళేశ్వరం మూడు ప్రాజెక్ట్ లు దెబ్బతిన్నాయని మండిపడ్డారు. సెలక్ట్ చేసిన సైట్ కూడా కరెక్ట్ కాదు.. సాయిల్ టెస్ట్ కూడా సరిగా చేయలేదన్నారు. రికార్డ్ కోసం నిర్మించారు… గొప్పలు చెప్పుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష్మి బ్యారేజ్ ను ఇసుక మీద కట్టారని మండిపడ్డారు.
అన్ని పిల్లర్ లను చెక్ చేస్తే తప్ప ప్రాజెక్ట్ ఉంటుందా లేదా అనేది తేలుతుందన్నారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నీళ్ళు వదలడంతో మోటర్ లు, గోర్లు, బర్లు కొట్టుకు పోయాయని మండిపడ్డారు. మనషులు ఉంటే పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. ప్రజలకు సమాచారం ఇవ్వకుండా.. తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన మోడల్ ప్రకారం నిర్మంచామని మాకు సంబంధం లేదని కాంట్రాక్టర్ లు అంటున్నారని తెలిపారు. కేసీఆర్ లక్ష కోట్లు గంగ పాలు చేశారని నిప్పులు చెరిగారు. దీనికి ప్రధాన కారకుడు కేసీఆర్ అన్నారు. పూర్తి బాధ్యత వహించి కేసీఆర్ రాజీనామా చేయాలి అని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై శ్వేత పత్రం విడుదల చేయాలని అన్నారు.
లక్ష్మి బ్యారేజ్ కుంగి పోవడానికి కారణం డిజైన్ లోపమే అని బీజేపీ నేత కొండ విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. సైన్స్ కి వ్యతిరేకంగా కాళేశ్వరం ప్రాజెక్టు లను డిజైన్ చేశారని మండిపడ్డారు. అన్ని విధాలుగా ఆప్రాజెక్ట్ ను కేంద్ర ప్రభుత్వం చెక్ చేస్తుందన్నారు. కేంద్రానికి లేఖ రాస్తున్నామన్నారు. ఇంజనీరింగ్ తప్పుపై.. దీని మీద చర్యలు తప్పకుండా ఉంటాయని తెలిపారు.
కాలేశ్వరం డ్యాం సేఫ్టీ పై కేంద్రం ఆరా తీస్తుంది. మెడిగడ్డ బ్యారేజ్ లో 15వ నెంబర్ పిల్లర్ నుంచి 20 వ నెంబర్ పిల్లర్ కుంగిన నేపథ్యంలో కేంద్రం తనిఖీ చేపట్టింది.
డ్యామ్ సేఫ్టీని పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. కేంద్ర జలవనరుల సంఘం సభ్యుడు అనిల్ జైన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీ పర్యవేక్షించనున్నారు. నేడు తెలంగాణ ఇరిగేషన్ అధికారులతో కేంద్ర అధికారుల బృందం సమావేశం కానున్నారు. రేపు కాలేశ్వరం డ్యామ్ ను కేంద్ర బృందం సందర్శించనున్నారు. అనంతరం కేంద్ర ప్రభుత్వానికి అధికారుల బృందం నివేదిక సమర్పించనున్నారు.
Chandrababu: చంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాఖత్