Etela Rajender : రాజకీయాలకు అతీతంగా ప్రజల బాధ్యతను తీసుకోవాలి..
- జీహెచ్‌ఎంసీ బడ్జెట్ పై ఈటల రాజేందర్ అభిప్రాయాలు
- హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం నిధుల వినియోగం పై చర్చ
- ఉస్మానియా హాస్పిటల్ నిర్మాణానికి సంబంధించి ఈటల రాజేందర్ అభిప్రాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Etela Rajender : తెలంగాణలో మూడో వంతు జనాభాను జీహెచ్‌ఎంసీ పాలిస్తుందని, రాజకీయాలకు అతీతంగా ప్రజల బాధ్యతను తీసుకోవాలన్నారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాస మారింది. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. సంకుచితత్వానికి పోకుండా అవసరమైన చోట నిధులు ఇవ్వాలన్నారు. నగరంలోని కనీస సౌకర్యాలకు నోచుకొని ప్రాంతాలపై దృష్టి పెట్టాలన్నారు. బడ్జెట్ ఎంత, ఖర్చులు, రాబడి అనేది పక్కన పెట్టి సమస్యలపై దృష్టి పెట్టకపోతే నగరం మసకబారుతుందని ఆయన అన్నారు. జీహెచ్ఎంసీ బాధేంటో నాకు తెలుసు అని, పాత కాంట్రాక్టర్లకే బిల్లులు రాకపోతే కొత్త కాంట్రాక్టర్లు ఎలా వస్తారు..? అని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్యేల కంటే కార్పొరేటర్లకు రీచ్ ఎక్కువగా ఉంటుందని, పేదల్లో నిరుపేదలను గుర్తించి ఇందిరమ్మ ఇళ్లు ఇతర సంక్షేమ పథకాలు ఇవ్వాలన్నారు. కొత్త ఉస్మానియా హాస్పిటల్ నిర్మాణానికి మేం వ్యతిరేకం కాదని, ఉస్మానియా హాస్పిటల్ ఉన్నచోటనే గొప్ప హాస్పిటల్ గా కట్టొచ్చన్నారు.
Vizag: శెభాష్.. 24 గంటల్లో మిస్సింగ్ కేసును చేధించిన విశాఖ సిటీ పోలీస్
Also Read
అంతేకాకుండా..’ఉస్మానియా హాస్పిటల్ వద్ద ఉన్న ఆలయాన్ని తరలించి అక్కడే హాస్పిటల్ కట్టొచ్చు.. నగరంలో ఉన్న నీటి వనరులన్నీ మురికి కూపాలుగా మారాయి.. హైదరాబాద్ లో దుర్గందభరిత వాతావరణం లేకుండా చూడాలి.. నగరంలో నేను చూసిన అనుభవాలతో జీహెచ్ఎంసీ కి లేఖ రాస్తాను.. పాలక మండలిపై ప్రజల్లో విశ్వాసం లేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి.. జీహెచ్ఎంసీ పైసలు లేవని చెబితే పరువుపోతుంది..’ అని ఈటల రాజేందర్ అన్నారు.
YCP: వైసీపీ ఫీజు పోరు పోస్టర్ ఆవిష్కరణ.. ఫిబ్రవరి 5న ఆందోళనకు పిలుపు
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!