ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. వచ్చే ఏడాది నుంచి EPFO కొత్తగా ప్రారంభించనున్న EPFO 3.0 ప్లాట్‌ఫామ్ ద్వారా ATM/UPI సాయంతో పీఎఫ్ డబ్బులను నేరుగా విత్‌డ్రా చేసుకునే సౌకర్యం కల్పించనున్నట్టు తెలుస్తోంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా ముఖ్యంగా ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ఉపయోగం కలగనున్నదని ఈపీఎఫ్ అధికారులు తెలిపారు. ఎన్నో నెలలుగా ఉద్యోగులు ఆశించినట్లుగా, ATM ద్వారా EPF ఉపసంహరణ సేవ కొత్త సంవత్సరం నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.…
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నుంచి గుడ్ న్యూస్ వచ్చింది. అదేంటే తెలుసుకోవాలనుంది కదా.. అయితే దీపావళి నుంచి ఏటీఎం, యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బును వెంటనే విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈపీఎఫ్‌ఓ 3.0 అమలైతే పీఎఫ్ డబ్బు కోసం రోజులు వేచి చూడాల్సిన అవసరం ఉండదని ఈపీఎఫ్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. యూపీఐ యాప్‌లు లేదా ఏటీఎంల ద్వారా రూ. లక్ష వరకు అత్యవసర విత్‌డ్రాలను వెంటనే చేసుకోవచ్చు. 8 కోట్ల మందికి పైగా సభ్యులకు ఇది సాయపడుతుంది.…
EPFO 3.0: ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఏటీఎంల ద్వారా పీఎఫ్ డబ్బును ఉపసంహరించుకునే కొత్త సౌకర్యాన్ని త్వరలో ప్రవేశపెట్టబోతున్నారు. ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలను సులభంగా నిర్వహించుకునేందుకు EPFO 3.0 పేరుతో కొత్త విధానాలను ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. వాస్తవానికి సెప్టెంబర్ 2025లో ఈ కొత్త విధాలను ప్రవేశపెట్టాల్సి ఉంది. కానీ కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా వాటిని నిలిపివేశారు. తాజా సమాచారం ఏమిటంటే దీపావళికి ముందు ఏటీఎంల ద్వారా పీఎఫ్ డబ్బును ఉపసంహరించుకునే వెసులుబాటును ఖాతాదారులకు కల్పించనున్నట్లు సమాచారం.…