EPFO 3.0: ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఏటీఎంల ద్వారా పీఎఫ్ డబ్బును ఉపసంహరించుకునే కొత్త సౌకర్యాన్ని త్వరలో ప్రవేశపెట్టబోతున్నారు. ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలను సులభంగా నిర్వహించుకునేందుకు EPFO 3.0 పేరుతో కొత్త విధానాలను ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. వాస్తవానికి సెప్టెంబర్ 2025లో ఈ కొత్త విధాలను ప్రవేశపెట్టాల్సి ఉంది. కానీ కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా వాటిని నిలిపివేశారు. తాజా సమాచారం ఏమిటంటే దీపావళికి ముందు ఏటీఎంల ద్వారా పీఎఫ్ డబ్బును ఉపసంహరించుకునే వెసులుబాటును ఖాతాదారులకు కల్పించనున్నట్లు సమాచారం. బ్యాంకుల మాదిరిగా సరళమైన లావాదేవీని సృష్టించే ప్రయత్నాల్లో భాగంగా ప్రభుత్వం ఈ చర్య తీసుకోనున్నట్లు పేర్కొంది.
READ ALSO: Off The Record: మూడు రాజధానులపై వైసీపీ స్టాండ్ ఎందుకు మారింది..?
అక్టోబర్ 10, 11 తేదీల్లో సమావేశం..
2025 అక్టోబర్ 10, 11 తేదీల్లో ఈపీఎఫ్ఓ కార్యనిర్వాహక కమిటీ సమావేశం కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన జరగనుంది. దీపావళికి ముందు దాదాపు 8 కోట్ల మంది పీఎఫ్ చందాదారుల నోటిఫికేషన్‌కు సంబంధించి ఈ సమావేశంలో ముఖ్యమైన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది. ఈ సమావేశంలో ఈపీఎఫ్‌వో 3.0 అని పిలిచే ప్రాజెక్ట్‌పై ముఖ్యమైన నిర్ణయాలు వెలువడనున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఏటీఎంల ద్వారా పీఎఫ్ డబ్బును ఉపసంహరించుకునే సౌకర్యం, యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బును ప్రవేశపెట్టడం వంటి బ్యాంకింగ్ సేవలపై చర్చించనున్నట్లు సమాచారం. అదనంగా నెలకు కనీస పెన్షన్‌ను రూ.1000 నుంచి రూ.1,500 నుంచి రూ. 2,500 కు పెంచే ప్రణాళిక గురించి కూడా చర్చకు రానున్నట్లు తెలుస్తుంది.
వైద్య, విద్య, వివాహం, ఇల్లు కొనుగోలు వంటి కొన్ని నిర్దిష్ట కారణాలతో పీఎఫ్ ఖాతాదారులు ఇంటర్నెట్ ద్వారా రూ. 5 లక్షల వరకు వారి డబ్బులను విత్‌డ్రా చేసుకోవచ్చు. కానీ ఆ డబ్బులు చేతుల్లోకి రాడానికి కనీసం 2-3 రోజులు పడుతుంది. కొత్తగా పీఎఫ్‌లో ఏటీఎం సేవలు అందుబాటులోకి వస్తే డబ్బును తీసుకోవడం మరింత సులభతరం, వేగవంతం కానుంది. ఇక్కడ విశేషం ఏమిటంటే.. బ్యాంకుల ద్వారా పీఎఫ్ డబ్బును సులభంగా పొందేలా చేయడం చేస్తే పథకం ఉద్దేశ్యమే దెబ్బతింటుందని పలు కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. పీఎఫ్ అనేది ఉద్యోగులు తమ పదవీ విరమణ సమయంలో, అత్యవసర పరిస్థితులకు ఉపయోగించే పథకం అని వాటిని ఏటిఎంల ద్వారా తీసుకోడానికి అనుమతించేలా చేస్తే పథకం ఉద్దేశ్యం దెబ్బతింటుందని వారు అంటున్నారు.