EPFO: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నుంచి గుడ్ న్యూస్.. ఏంటో తెలుసా…
- ఈపీఎఫ్‌ఓ 3.0 తీసుకురానున్న ఆర్గనైజేషన్
- ఏటీఎం, యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బు విత్ డ్రా చేసుకునే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నుంచి గుడ్ న్యూస్ వచ్చింది. అదేంటే తెలుసుకోవాలనుంది కదా.. అయితే దీపావళి నుంచి ఏటీఎం, యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బును వెంటనే విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈపీఎఫ్‌ఓ 3.0 అమలైతే పీఎఫ్ డబ్బు కోసం రోజులు వేచి చూడాల్సిన అవసరం ఉండదని ఈపీఎఫ్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. యూపీఐ యాప్‌లు లేదా ఏటీఎంల ద్వారా రూ. లక్ష వరకు అత్యవసర విత్‌డ్రాలను వెంటనే చేసుకోవచ్చు. 8 కోట్ల మందికి పైగా సభ్యులకు ఇది సాయపడుతుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్‌ఓ 3.0 అనే కొత్త వ్యవస్థను తీసుకురావాలని ఈ సంస్థ చూస్తోంది. ఇది ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలను బ్యాంక్ ఖాతాల్లా పనిచేసేలా మార్చనుంది. ప్రస్తుతం పీఎఫ్ ఉపసంహరణ కోసం ఆన్‌లైన్ క్లెయిమ్ సబ్మిట్ చేయాలి. ఈ విధానంలో డబ్బులు విత్‌డ్రా చేసుకోవడానికి చాలా టైమ్ పడుతోంది. కొత్త వ్యవస్థలో యూఏఎన్, ఆధార్–-బ్యాంక్ లింక్ ఉంటే చాలు. వైద్య ఖర్చులు, విద్య, ఇల్లు, వివాహ అవసరాలకు డబ్బు వెంటనే విత్‌డ్రా చేసుకోవచ్చు. ప్రస్తుతం నెలకు రూ.వెయ్యిగా ఉన్న కనీస పింఛన్‌ను రూ.1,500–రూ.2,500కి పెంచే ప్రతిపాదనపై ఈపీఎఫ్‌ఓ బోర్డు చర్చిస్తోంది. ట్రేడ్ యూనియన్లు కోరుతున్న పాత డిమాండ్ ఇది. ఈపీఎఫ్‌ఓ 3.0 అమలైతే, భారత పీఎఫ్ వ్యవస్థలో అతిపెద్ద సంస్కరణలలో ఒకటిగా నిలుస్తుంది.
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!