భూమిపై విలువైన వాటిల్లో వజ్రం కూడా ఒకటి. భూమిలో ప్రత్యేక పరిస్థితుల్లో కర్భన సమ్మేళనాల కలయిక ద్వారా వజ్రాలు ఏర్పడతాయి. అయితే, టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరువాత కృత్రిమంగా ల్యాబ్‌లలో వజ్రాలను తయారు చేస్తున్నారు. వజ్రాలు అనేక రంగుల్లో దొరుకుతుంటాయి. వాటిల్లో బ్లాక్ వజ్రాలు చాలా అరుదైనవి. అరుదైన వాతారవణ పరిస్థితుల్లో ఈ వజ్రాలు ఏర్పడుతుంటాయి. ఇక ఇదిలా ఉంటే ప్రముఖ వజ్రాల వేలం సంస్థ సోత్‌బే ఖగోళానికి చెందిన ఓ వజ్రాన్ని వేలం వేయబోతున్నది. ఫిబ్రవరి…