ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా లండన్‌లోని ఓవల్ క్రికెట్ గ్రౌండ్‌లో భారత్‌తో జరుగుతున్న ఐదవ టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టీ20 తరహా బ్యాటింగ్ చేస్తోంది. ఇంగ్లండ్ టీమ్ ఇటీవలి కాలంలో ఆడుతున్న ‘బజ్‌బాల్’ ఆటను ఈ మ్యాచ్‌లో కొనసాగిస్తోంది. రెండో రోజు లంచ్ బ్రేక్ సమయానికి 16 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 109 పరుగులు చేసింది. క్రీజులో జాక్ క్రాలే (52), ఓలీ పోప్ (12) ఉన్నారు. బెన్ డకెట్ 38 బంతుల్లో 43…