Engineering Admissions 2025 : రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్ అడ్మిషన్ల కౌన్సెలింగ్ తుది విడత సీట్ల కేటాయింపు పూర్తయింది. మొత్తం 91,649 సీట్లు అందుబాటులో ఉండగా, అందులో 80,011 సీట్లు కేటాయించబడ్డాయి. ఇందులో కొత్తగా 4,720 మంది అభ్యర్థులు సీట్లు పొందగా, 20,028 మంది స్లయిడ్ అయ్యారు. ఇంకా 11,638 సీట్లు ఖాళీగా మిగిలాయి. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (EWS) కోటా కింద 6,085 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. మొత్తం 51 కళాశాలల్లో (5 యూనివర్సిటీలు, 46…
ఏపీలో విద్యా వ్యవస్థపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు.. రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందనడానికి ఏపీఈసెట్ అడ్మిషన్లే పెద్ద ఉదాహరణ అని విమర్శించారు. ఈసెట్ రిజల్ట్స్ వచ్చి దాదాపు 45 రోజులు అవుతున్నా ఇప్పటికీ కౌన్సిలింగ్ ప్రారంభం కాలేదన్నారు.
Basara IIIT : ఆర్జీయూకేటీ బాసర, మహబూబ్ నగర్ సెంటర్ లలో ఆరు సంవత్సరాల సమీకృత విద్యా విధానంలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించుటకు అడ్మిషన్ నోటిఫికేషన్ ను వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ విడుదల చేశారు. గ్రామీణ పేద విద్యార్థులకు 2008వ సంవత్సరంలో ప్రారంభించిన ఈ విశ్వవిద్యాలయం సాంకేతిక విద్యను అందించడమే లక్ష్యంగా ఏర్పాటయిందని, తదనుగుణంగా ఇంజనీరింగ్ విద్యను అందిస్తున్నామని తద్వారా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పేద విద్యార్థులు పొందుతున్నారని ఈ సందర్భంగా తెలిపారు. నోటిఫికేషన్ వివరాలు డబ్ల్యు…
తెలంగాణ ఇంజనీరింగ్ మొదటి విడత సీట్లు కేటాయించారు. కన్వీనర్ కోటాలో 78, 694 సీట్లు ఉండగా 75, 200 సీట్లు కేటాయించారు. అంటే 95.6 శాతం సీట్లు కేటాయించారు. 89 కాలేజీలో వంద శాతం సీట్లు కేటాయించారు. ఇందులో 7 యూనివర్సిటీ కాలేజీలు, 82 ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్సుల్లో53, 890 సీట్లు ఉంటే 53, 517 సీట్లు కేటాయించారు.