Engineering Admissions 2025 : రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్ అడ్మిషన్ల కౌన్సెలింగ్ తుది విడత సీట్ల కేటాయింపు పూర్తయింది. మొత్తం 91,649 సీట్లు అందుబాటులో ఉండగా, అందులో 80,011 సీట్లు కేటాయించబడ్డాయి. ఇందులో కొత్తగా 4,720 మంది అభ్యర్థులు సీట్లు పొందగా, 20,028 మంది స్లయిడ్ అయ్యారు. ఇంకా 11,638 సీట్లు ఖాళీగా మిగిలాయి. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (EWS) కోటా కింద 6,085 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు.
మొత్తం 51 కళాశాలల్లో (5 యూనివర్సిటీలు, 46 ప్రైవేట్) 100% అడ్మిషన్లు పూర్తయ్యాయి. విద్యార్థులు తమ అలాట్‌మెంట్ ఆర్డర్‌ను డౌన్‌లోడ్ చేసుకొని, ట్యూషన్ ఫీజును ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి. ఫీజు రీఫండ్‌లు చెల్లింపు చేసిన అదే బ్యాంక్ ఖాతాలో జమ చేయబడతాయి. చెల్లింపు చేసే ముందు క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ పరిమితిని చెక్ చేయాలి.
Pawan Kalyan: గిరిజన ప్రాంతాలపై పవన్ కళ్యాణ్ ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు..
సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ ద్వారా అడ్మిషన్‌ను నిర్ధారించడం తప్పనిసరి. ట్యూషన్ ఫీజు చెల్లించడానికి చివరి తేదీ 12 ఆగస్టు 2025. ఈ తేదీ వరకు చెల్లింపు చేయని అభ్యర్థుల అలాట్‌మెంట్ ఆటోమేటిక్‌గా రద్దవుతుంది. అలాగే, 11 నుంచి 13 ఆగస్టు 2025 మధ్య కేటాయించిన కళాశాలలో వ్యక్తిగతంగా హాజరుకావాలి. ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే ప్రొవిజనల్ అలాట్‌మెంట్ ఆర్డర్ రద్దవుతుంది. తుది విడత తర్వాత అడ్మిషన్ల రద్దుకు అవకాశం లేదు.
కోర్సుల వారీగా సీట్ల స్థితి
కంప్యూటర్ సైన్స్, ఐటీ సంబంధిత కోర్సుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) 46 సీట్లు, కంప్యూటర్ ఇంజినీరింగ్ (CME) 88 సీట్లలో 81 సీట్లు, కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్ (CSB) 323 సీట్లలో 316 సీట్లు భర్తీ అయ్యాయి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (CSE) 30,678 సీట్లలో 28,787 సీట్లు భర్తీ కాగా, డేటా సైన్స్ (DS) 66 సీట్లలో కేవలం 3 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (INF) 4,143 సీట్లలో 3,704 సీట్లు, AI & మెషిన్ లెర్నింగ్ (AIM) 1,282 సీట్లలో 1,119 సీట్లు భర్తీ అయ్యాయి.
ఎలక్ట్రానిక్స్ & ఎలక్ట్రికల్ కోర్సుల్లో బయో-మెడికల్ ఇంజినీరింగ్ (BME) 65 సీట్లు పూర్తిగా భర్తీ కాగా, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ (ECE) 12,193 సీట్లలో 10,225 సీట్లు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ (EEE) 4,990 సీట్లలో 3,349 సీట్లు భర్తీ అయ్యాయి.
సివిల్ & మెకానికల్ కోర్సుల్లో మెటలర్జికల్ (MET) 66 సీట్లు, ఆటోమొబైల్ (AUT) 46 సీట్లు పూర్తిగా భర్తీ కాగా, సివిల్ ఇంజినీరింగ్ (CIV) 3,718 సీట్లలో 2,613 సీట్లు, మెకానికల్ ఇంజినీరింగ్ (MEC) 3,457 సీట్లలో 2,150 సీట్లు భర్తీ అయ్యాయి.
ఇతర కోర్సుల్లో కెమికల్ ఇంజినీరింగ్ (CHE) 191 సీట్లు పూర్తిగా భర్తీ కాగా, బయో-టెక్నాలజీ (BIO) 148 సీట్లలో 102 సీట్లు, మైనింగ్ ఇంజినీరింగ్ (MIN) 288 సీట్లలో 220 సీట్లు భర్తీ అయ్యాయి.
Modi-Trump: అమెరికాపై ప్రతీకార సుంకాలకు భారత్ రెడీ.. దెబ్బకు దెబ్బ కొట్టే ప్రణాళిక!