పూణెలోని హింజెవాడి ఐటీ పార్క్‌లో పని చేస్తున్న 23 ఏళ్ల ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. తన కార్యాలయ భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు పియూష్ అశోక్ కవాడేగా గుర్తించారు.
అస్సాంలో దారుణం జరిగింది. నకిలీ బిల్లులు క్లియర్ చేసే విషయంలో పై అధికారుల నుంచి అధిక ఒత్తిడి రావడంతో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (PwD)లో అసిస్టెంట్ ఇంజనీర్(30)గా పని చేస్తున్న మహిళా ఇంజనీర్ ఆత్మహత్య చేసుకుంది.
UP techie Suicide: బెంగళూర్ టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. భార్య, అత్తమామల వేధింపులతో తాను ఎంతటి బాధను అనుభవించాననే విషయాన్ని వీడియోలో వెళ్లడించి, సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా పలువురు వ్యక్తులు, భార్యల వేధింపుల వల్ల మరణించారు. చట్టాలను దుర్వినియోగం చేసి, అక్రమ కేసులు పెట్టడం, మానసికంగా వేధించడంతో పలువురు తనువు చాలిస్తున్నారు.