Jammu Kashmir: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ రోజు త్రాల్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది.
Jammu Kashmir: ఉత్తర కశ్మీర్‌లోని బందిపొర జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ఈ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులు దాక్కున్నట్లు వార్తలు రావడంతో భద్రతా బలగాలు ఈ చర్యలు చేపట్టాయి.
జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) సమీపంలో ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం కాల్చి చంపినట్లు అధికారులు ఆదివారం తెలిపారు. శనివారం అర్థరాత్రి జిల్లాలోని బాలాకోట్ సెక్టార్‌లో ఉగ్రవాదులు హతమైనట్లు వారు తెలిపారు.
Lashkar Terrorist Killed In Encounter: జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు పెట్రేగిపోయారు. పుల్వామా, షోఫియాన్ జిల్లాల్లో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఆదివారం పుల్వామాలో సీఆర్పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులపైకి ఉగ్రవాదులు కాల్పలు జరిపారు. ఈ ఘటనలో విధి నిర్వహణలో ఉన్న ఒక పోలీస్ మరణించారు. సీఆర్పీఎఫ్ కు చెందిన సిబ్బంది గాయపడ్డారు. సంఘటన జరిగిన ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. పుల్వామాలోని పింగ్లాన వద్ద సీఆర్పీఎఫ్, కాశ్మీర్ పోలీసుల నాకా పార్టీపై ఉగ్రవాదులు దాడులు చేశారు.
జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో బుధవారం భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అల్-ఖైదా అనుబంధ సంస్థ అన్సార్ గజ్వతుల్ హింద్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను కాల్చిచంపినట్లు పోలీసులు తెలిపారు.
Encounter underway in jammu kashmir: జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. బుధవారం తెల్లవారుజామున ప్రారంభం అయిన ఈ ఎన్ కౌంటర్ ఇప్పటికీ కొనసాగుతోంది. ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారంతో జమ్మూకాశ్మీర్ లోని బుద్గామ్ జిల్లా వాటర్ హైల్ ప్రాంతాన్ని భద్రతాబలగాలు చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో ఇరు పక్షాల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. లష్కరే తోయిబా/ ది రెసిస్టెంట్ ఫ్రంట్ కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు…