ఫ్రెంచ్ కంపెనీ సాఫ్రాన్ గ్రూప్ తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టాలని నిర్ణయానికి వచ్చింది.. ఆ కంపెనీ నిర్ణయాన్ని స్వాగతించిన మంత్రి కె. తారక రామారావు ఆనందాన్ని వ్యక్తం చేశారు
ఏపీలో పరిశ్రమలపై ప్రత్యేకంగా ఫోకస్ పెంచాలని సీఎం జగన్ అన్నారు. అమరావతిలో పరిశ్రమల శాఖపై సీఎం వైఎస్.జగన్ సమీక్ష చేపట్టారు. పరిశ్రమల కోసం కేటాయించిన భూముల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఎంఎస్‌ఎంఈల పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఏటా క్రమం తప్పకుండా ఎంఎస్‌ఎంఈలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇండస్ట్రియల్ పార్కుల్లో కాలుష్య నివారణపై జగన్ మాట్లాడారు. పారిశ్రామిక వాడల్లో కాలుష్యాన్ని నివారించే వ్యవస్థలను పరిశీలించాలి. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీకి తగిన…
బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ హాట్ ట్వీట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఉదయం కేటీఆర్ చేసిన ట్వీట్ కి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రీట్వీట్ చేశారు. కౌంటర్ అటాక్ చేశారు. కిషన్ రెడ్డి ట్వీట్ హాట్ టాపిక్ అవుతోంది. టీఆర్ఎస్ పాలనలో “ఇంటికో ఉద్యోగం లేదు” “నిరుద్యోగ భృతి లేదు” “ఉచిత ఎరువులు లేదు” “ఋణమాఫీ లేదు” “దళిత ముఖ్యమంత్రి లేదు” “దళితులకు మూడెకరాల భూమి లేదు” “పంటనష్ట పరిహారం లేదు” “దళితబంధు లేదు”…
తెలంగాణలో రూ. 250 కోట్లతో జాంప్ ఫార్మాను నెలకొల్పడం సంతోషకరం అన్నారు మంత్రి కేటీఆర్. దీనివల్ల 200 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. పరోక్షంగా వేలాదిమందికి ప్రయోజనం కలుగుతుందన్నారు. గుజరాత్ పారిశ్రామికవేత్తలు తమకు అహ్మదాబాద్ కంటే హైదరాబాదే ఎక్కువ ఇష్టం అంటున్నారు. జీనోమ్ వ్యాలీ ఆకర్షణీయమైన పెట్టుబడుల కేంద్రంగా మారిందని హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ పరిశ్రమలకు అద్భుతమైన సహకారాన్ని అందిస్తున్నారన్నారు. 50 బిలియన్ డాలర్లుగా ఉన్న జీనోమ్ వ్యాలీ పెట్టుబడులు.. 2030 కల్లా 100 బిలియన్లకు…
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర తెలంగాణలో కొనసాగుతోంది. ఇది బంగారు తెలంగాణ కాదు…బాధల తెలంగాణ అంటూ కేసీఆర్ పాలనపై ఆమె నిప్పులు చెరిగారు. బార్లు – బీర్లు – ఆత్మహత్యల తెలంగాణ గా మారింది రాష్ట్రం. ఉద్యమం చేసిండని కేసిఆర్ ను 2సార్లు ముఖ్యమంత్రిని చేస్తే ఈ ప్రజలకు ఆయన చేసిందేమిటి? https://ntvtelugu.com/anchor-anasuya-fires-on-netizen/ ఎన్నికలప్పుడు గారడీ మాటలు తప్ప కేసిఆర్ తెలంగాణను ఉద్దరించేది ఏమిటి? మళ్ళీ కేసిఆర్ మాటలకు మోసపోవద్దని హితవు పలికారు వైఎస్ షర్మిల.…
వివిధ ప్రాచీన కళలు కనుమరుగవుతున్నాయి. గతంలో ఏ చిన్న కార్యక్రమం వున్నా డప్పు ద్వారా అందరికీ తెలియచేసేవారు. విద్యార్థుల్లో ఉన్న సామాజిక చైతన్య స్పృహని ,వాళ్లలో ఉన్న కళని పైకి తెచ్చి ఉపాధి అవకాశాలను మెరుగు పరిచే విధంగా చర్యలు చేపడుతోంది ప్రభుత్వం. మరుగున పడిన డప్పు కళను ఈతరం సమాజానికి పరిచయం చేద్దామని సంగారెడ్డి పట్టణం తార ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డప్పు సర్టిఫికెట్ కోర్సు ఏర్పాటు చేశారు ప్రిన్సిపాల్ ప్రవీణ. ఈ సర్టిఫికెట్ కోర్స్…
వరంగల్ నగరంలో టెక్ సెంటర్ ని ఏర్పాటు చేయనుంది ఐటి దిగ్గజం జెన్పాక్ట్. తెలంగాణ ప్రభుత్వం కృషితో ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి. హైదరాబాద్ తర్వాత తెలంగాణలో పెద్ద నగరం వరంగల్. తాజాగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కృషివలన వరంగల్ నగరానికి ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటైన జెన్ ఫాక్ట్ రానుంది. మంత్రి కేటీఆర్‌ని ప్రగతిభవన్ లో కలిసిన జెన్ ఫాక్ట్ ప్రతినిధి బృందం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి…
హైదరాబాద్ సౌత్ జోన్ పోలీస్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ మెగా జాబ్ మేళా లో ముఖ్య అతిథిగా నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, సౌత్ జోన్ డీసీపీ భూపాల్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నగర సీపీ అంజనీ అంజనీ కుమార్ మాట్లాడుతూ… పాతబస్తీ చంద్రయాన్ గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో హైదరాాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించడం సంతోషంగా ఉంది. మొత్తం 20 ప్రైవేట్ కంపెనీలు…
టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ రంగంలో ఇప్పటికే లక్షా ముప్పై వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు సీఎం కేసీఆర్… నూతన జోన్ల ఆమోదం తర్వాత జోన్లలో క్లారిటీ రావడంతో మరో 50 వేల ఉద్యోగాలకోసం కార్యాచరణ రూపొందించామన్నారు.. భవిష్యత్తులో జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగ నియామకాలు ఉంటాయని తెలిపారు. ఇక, అభివృద్ధి సంక్షేమ పథకాల ఫలితాలను తెలంగాణ ప్రజలు దక్కించుకోవడం ఇప్పటికే ప్రారంభమైందన్న ముఖ్యమంత్రి… దండుగన్న వ్యవసాయం నేడు పండుగలా మారడమే అందుకు ఉదాహరణగా…