భారత స్పిన్నర్ల మాయాజాలంతో టీ20 ప్రపంచ కప్ 2024 రెండవ సెమీ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను 68 పరుగుల తేడాతో ఓడించి భారత్ ఫైనల్‌కు చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. లక్ష్యాన్ని చేధించడానికి రంగంలోకి దిగిన ఇంగ్లండ్ బ్యాటింగ్ చేతులెత్తేయడంతో 16.3 ఓవర్లలో 103 పరుగులకు ఆలౌటైంది. ఈ క్రమంలో.. టీమిండియా ఫైనల్స్కు చేరింది. ఈ ఆనందంలో రోహిత్ శర్మ ఎమోషనల్ అయ్యాడు.
Jaya Jaya Telangana: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ ప్రజల ముందుకు వచ్చింది. పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన దశాబ్ది వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి ఈ గీతాన్ని ఆవిష్కరించారు.
టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీకి 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును మంగళవారం నాడు బీసీసీఐ ప్రకటించింది. అయితే.. టీమిండియా జట్టులో ఫినిషర్ రింకూ సింగ్ పేరు లేకపోవడంతో.. క్రికెట్ అభిమానులతో పాటు, పలువురు మాజీ క్రికెటర్లు ఆశ్చర్యపోయారు. మరోవైపు.. అతని తల్లిదండ్రులు కూడా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కేవలం రింకూ సింగ్ పేరు ట్రావెల్ రిజర్వుగా మాత్రమే ఉంది. మరోవైపు.. టీమిండియాకు ఫినిషర్ లేకుండానే మెగా టోర్నీలో ఆడేందుకు సిద్ధమవుతుంది.
గుజరాత్లోని బనస్కాంత లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గనిబెన్ ఠాకోర్ భావోద్వేగానికి గురయ్యారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లడుతూ ఏడ్చారు. అంతకుముందు ఎంపీ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ వేసేందుకు భారీగా ట్రాక్టర్ల ర్యాలీతో వెళ్లి నామినేషన్ వేశారు. అనంతరం సభలో మాట్లాడుతూ.. ఈ నియోజకవర్గ ప్రజలు తనను పూల మాలలు వేస్తూ ఆశీర్వదిస్తున్నారంటూ ఏడ్చేసింది.
భారత క్రికెట్ జట్టులో అత్యంత సక్సెస్ ఫుల్ కెప్టెన్ ఎవరు అంటే.. మహేంద్ర సింగ్ ధోనీ అని చెప్పవచ్చు. అతని కెప్టెన్సీలో భారత్‌కు మూడు ఐసీసీ టైటిళ్లను సాధించిపెట్టాడు. ధోనీ సారథ్యంలో టీమిండియా.. మొదటగా టీ20 ప్రపంచకప్, ఆ తర్వాత వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీలను గెలుచుకుంది. టీమిండియా ఐసీసీ టైటిల్స్ ను గెలిచి 28 ఏళ్లు అవుతుంది. 2011 ప్రపంచకప్ ఫైనల్‌లో ధోనీ కొట్టిన విన్నింగ్ సిక్స్ అందరి మదిలో గుర్తుండిపోతుంది. ఆ తర్వాత ఐసీసీ…
టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన కెరీర్లో 100వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు. ఈ సందర్భంగా.. ఈరోజు మ్యాచ్కు ముందు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అశ్విన్‌కు 100వ టెస్టు క్యాప్‌ను అందజేశాడు. అశ్విన్ తన 100 టెస్ట్ సందర్భంగా.. భార్య ప్రీతి నారాయణ్, తన ఇద్దరు కూతుళ్లు ధర్మశాలకు వచ్చారు. క్యాప్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు అశ్విన్‌కు తోటి ఆటగాళ్లు గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చారు. భారత ఆటగాళ్లు ఇరువైపు…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. కాగా.. మూడురోజుల పాటు జరిగిన సమావేశాల్లో అసెంబ్లీ 9 బిల్లులకు ఆమోదం తెలిపింది. దీంతో ఈరోజు సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. కాగా.. ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం భావోద్వేగానికి లోనయ్యారు. శాసనసభ స్పీకర్గా శ్రీకాకుళం నుండి నాల్గవ వ్యక్తిగా పని చేసే అదృష్టం దక్కిందని తెలిపారు. సమావేశాల్లో ప్రతిసారి నిష్పక్షపాతంగా వ్యవహరించానని అన్నారు. ప్రతిపక్ష సభ్యులకు సమాన అవకాశాలు కల్పించానని పేర్కొన్నారు.…
కొత్త ప్రభాకర్ రెడ్డికి గజ్వేల్ లో ప్రాథమిక చికిత్స అందించాం.. రక్త స్రావం ఎక్కువ అవుతోంది.. హైదరాబాద్ తీసుకెళ్ళమని డాక్టర్లు చెప్పారు అని చెబుతూ మంత్రి హరీశ్ రావు భావోద్వేగానికి లోనైయ్యారు. అన్నారు. భౌతిక దాడులకు, హత్యా యత్నాలకు దిగడం సరైంది కాదు.. దాడి చేసిన వ్యక్తి ఎవరు... ఎందుకు చేశాడు అనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆసియా క్రీడలు 2023 మహిళల క్రికెట్ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు 19 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో స్మృతి మంధాన బ్యాట్‌తో అద్భుత ప్రదర్శన చేసింది. ఈ విజయాన్ని చాలా స్పెషల్‌గా అభివర్ణిస్తూ.. జాతీయ గీతాలాపన సమయంలో తాను చాలా ఎమోషనల్ అయ్యానని చెప్పింది.
అమ్మను మించిన దైవం లేదు.. అమ్మంటే ఎవరికైనా పిచ్చి.. చెప్పలేనంత ఇష్టం ఉంటుంది.. అమ్మకు ఏదైనా కష్టం వచ్చిందంటే ఇక ఏ బిడ్డ అయిన తట్టుకోలేదు.. అలాంటి తల్లి ప్రాణపాయంలో ఉంటే.. ఇక బతకదని తెలిస్తే.. ఆ కన్నతల్లిని కాపాడుకునేందుకు ఏ కొడుకైనా ఎంతంటి సాహసానికైనా దిగుతాడు. తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టి అయిన కాపాడుకోవాలని తెగ ఆరాట పడిపోతారు.. అలాంటి ఓ కొడుకు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది..…