ఏలూరు జిల్లాలో లాకప్ డెత్ చోటుచేసుకుంది. భీమడోలు పోలీసు స్టేషన్ లో నిందితుడు లాకప్ డెత్ కి గురైనట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే, నిందితుడు ఉరివేసుకుని మరణించాడంటున్నారు పోలీసులు. ఓ చోరీ కేసులో మూడు రోజుల క్రితం అప్పారావు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు భీమడోలు పోలీసులు. సూరప్పగూడెంకు చెందిన అప్పారావు స్టేషన్ లో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అప్పారావు బాత్రూమ్ లో ఉరివేసుకున్నాడంటున్నారు పోలీసులు. మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్నాచింగ్ కేసులో పోలీసులు…