సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు తాజాగా మీడియా పూర్వకంగా చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాపితంగా సీపీఎం పార్టీ వ్యవహరించాల్సిన తీరు పై సమీక్ష చేసుకోవాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసామని ఆయన చెప్పారు. ఇకపోతే ఈ సమావేశంలో 70 ఏళ్లుగా సమకూర్చుకున్న దేశ సంపదను మోడీ కొల్లగొట్టారని.. 10 ఏళ్ళ పాలనలో బీజేపి దేశాన్ని ధ్వంసం చేసిందని ఆయన పేర్కొన్నారు. బీజేపీ కూటమికి 400 స్థానాలు…