దేశంలో గత కొన్ని రోజులుగా విద్యుత్ సమస్యలపై వార్తలు వస్తున్నాయి. బొగ్గు కొరత తీవ్రంగా ఉందని, ఈ కోరత ఇంకోన్నాళ్లు ఇలానే కొనసాగితే విద్యుత్ సంక్షోభం తప్పదని రాష్ట్రాలు పేర్కొన్నాయి. దీనిపై ఈరోజు కేంద్ర మంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి విద్యుత్, బొగ్గుశాఖ మంత్రులు, అధికారులు హాజరయ్యారు. దేశంలో బొగ్గు కొరత లేదని, తగినంత బొగ్గు నిల్వలు ఉన్నాయని కేంద్ర మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న బొగ్గు నిల్వలను…
దేశంలో బొగ్గు కొరత తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. బొగ్గు కొరత కారణంగా విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోయింది. మరో పది రోజులపాటు ఇలాంటి పరిస్థితి కొనసాగవచ్చిన అధికారులు చెబుతున్నారు. అన్నిరాష్ట్రాలు బొగ్గుకొరతను ఎదుర్కొంటున్నాయి. మహారాష్ట్రలో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉన్నది. బొగ్గు కొరత కారణంగా రాష్ట్రంలో 13 విద్యుత్ ప్లాంట్లను తాత్కాలికంగా మూసివేశారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు విద్యుత్‌ను ఆచితూచి…
ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్ లేఖ రాశారు. పెంచిన విద్యుత్ ఛార్టీల కారణంగా వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారని, వారిపై మోయలేని భారం పడిందని నారా లోకేష్ లేఖలో పేర్కొన్నారు. ట్రూఅప్ ఛార్జీలు తక్షణమే ఉపసంహరించుకోవాలని లోకేష్ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో కుప్పకూలిన విద్యుత్ రంగాన్ని అత్యవసరంగా గాడిన పెట్టాలని, సీఎం ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు కరెంట్ ఛార్జీలు పూర్తిగా తగ్గిస్తామని ప్రతీ సభలో చెప్పారని లేఖలో పేర్కొన్నారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో…
దేశంలో విద్యుత్ వినియోగం పెరగడంతో చాలా రాష్ట్రాల్లో విద్యుత్ కొరత ఏర్పడింది. విద్యుత్ కొరత ఏర్పడటంతో రాష్ట్రప్రభుత్వాలు ప్రజలకు కీలక సూచనలు చేస్తున్నాయి. ఏపీలో విద్యుత్ సమస్యపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. రాష్ట్రంలో విద్యుత్ కొరత తీవ్రంగా ఉందని, రాబోయే రోజుల్లో అధికారికంగా విద్యుత్ కోతలు విధించాల్సి రావొచ్చని సజ్జల పేర్కొన్నారు. ప్రజలు వారి ఇళ్లల్లో విద్యుత్ వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించుకోవాలని కోరారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల…
దేశంలో బొగ్గు నిల్వలు అడుగంటిపోయాయి. కరోనా తరువాత అన్ని రంగాలు తిరిగి తెరుచుకోవడంతో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. డిమాండ్‌కు తగినతంగా విద్యుత్ ఉత్పత్తి జరగడంలేదు. గతంలో మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రాల్లో కూడా విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోయింది. దేశంలో బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు అధికంగా ఉన్నాయి. అయితే కరోనా కాలంలో బొగ్గుతవ్వకాలు తగ్గిపోయాయి. దీంతో నిల్వలు తగ్గిపోవడంతో సంక్షోభం ఏర్పడింది. ఈ సంక్షోభంపై ఈరోజు కేంద్ర మంత్రి అమిత్ షా నేతృత్వంలో అత్యవసర…
కరోనా సమయంలో కరెంట్ వినియోగం తగ్గిపోయింది.. ఆ తర్వాత సాధారణ పరిస్థితులు నెలకవడంతో.. మళ్లీ అన్ని సంస్థలు క్రమంగా తెరుచుకుంటున్నాయి.. దీంతో.. విద్యుత్ డిమాండ్ పెరుగుతూ పోతోంది… ఇదే ఇప్పుడు సమస్యగా మారిపోతోంది… చైనా లాంటి దేశాలు కూడా విద్యుత్ సంక్షోభంలోకి వెళ్లిపోతున్నాయి… ఇదే సమయంలో.. భారత్‌కు విద్యుత్ సంక్షోభం తప్పదనే హెచ్చరికలున్నాయి.. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.. దేశంలోని థర్మల్ కేంద్రాలకు బొగ్గు సరఫరా పెంచుతామని.. సంక్షోభాన్ని తప్పిస్తామని అందులో స్పష్టంచేసింది…
అనంతపురం : ఏపీ సర్కార్ పై మరోసారి ఫైర్ అయ్యారు పయ్యావుల కేశవ్. జగన్ ప్రభుత్వం అసమర్థత వల్ల విద్యుత్ రంగంలో తప్పులు జరుగుతున్నాయని… రాయలసీమ పవర్ ప్లాంట్ ను అన్యాయంగా మూసివేశారని మండిపడ్డారు. అత్యధిక ధరలకు విద్యుత్ ను బయట నుంచి కోనుగోలుచేయడం ఎవరిదీ తప్పు…? అని ప్రశ్నించారు పయ్యావుల. ప్రస్తుతం విద్యుత్ సంస్థలో ప్రక్షాళన అవసరమన్నారు పయ్యావుల. ట్రూ అప్ పేరు ఎక్కడి నుంచి వచ్చిందని… ట్రూ అప్ ఛార్జీలను ఎందుకు విత్ డ్రా…
చైనాలో ఎవర్ గ్రాండ్ సంక్షోభం మరవక ముందే మరోక సంక్షోభం బయటకు వచ్చింది. కరోనా నుంచి చైనా బయటపడుతున్న సమయంలో అన్ని రంగాలు తిరిగి తెరుచుకున్నాయి. దీంతో కరెంట్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. కరెంట్ వినియోగం పెరిగిపోవడంతో తీవ్రమైన కొరత ఏర్పడింది. వాణిజ్య పరమైన విద్యుత్ వినియోగం పెరగడంతో చివరకు వీధిలైట్లకు కూడా విద్యుత్‌ను కట్ చేశారు. 2020 తో పోలిస్తే 2021లో వినియోగం 13శాతం పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. డిమాండ్‌కు తగినంతగా విద్యుత్ సరఫరా లేకపోవడంతో…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ, ఏపీ ప్రత్యేక రాష్ట్రాలుగా విడిపోయి ఏడేళ్లు గడుస్తోంది. అయినా ఈ రెండు రాష్ట్రాల మధ్య విభజన పెట్టిన చిచ్చు ఇంకా చల్లారడం లేదు. తరుచూ ఇరు రాష్ట్రాల మధ్య కొత్త పంచాయతీలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే జలవివాదాలు, సరిహద్దు వివాదాలు, నిధుల వాటా విషయాల్లో తెలుగు రాష్ట్రాల మధ్య ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తాజాగా ఇరు రాష్ట్రాల మధ్య కరెంట్ ఫైట్ నడుస్తుండటం చర్చనీయాశంగా మారింది. తమకు రావాల్సిన విద్యుత్ బకాయిలను ఇప్పించాలని తాజాగా…